దక్షిణేశ్వరీ స్తవము

on 0 comments Read Full Article




               దక్షిణేశ్వరీ స్తవము
రచన -శ్రీశ్రీశ్రీ అనుభవానంద స్వామూలవారు 
చ -అనుపమవిక్రమోజ్వల మహాద్భుత శక్తిచరా చరంబులన్ 
గని భరియించి తల్ల యమకామ్యత చేయు నచిన్త్య లీలలో 
మునుగుచు,తేలుచుందు వట మూర్తి వహించిన మృత్యువోయనన్ 
నిను నెటుజేరువాడ  జననీ!కరుణామయి   !దక్షిణేశ్వరీ!

   అమ్మా! దక్షిణేశ్వరీ !కరుణామయీ!చరాచర సృష్టి ,స్థితి ,లయముల నిష్కామంగా చేయుచూ ,మనస్సున కందని లీలలో   మునుగుచు ,అపర మృత్యువోయనునట్లుండు నిన్ను ఏవిధంగా   చేరేది?
ఉ -చండిక!యెట్లు నిన్ గన !ప్రచండ పరాక్రమ విక్రమప్రభా 
ఖండ విభూతి మూర్తిరో !అగాధ మహా ప్రలయాభ్ది రూప!బ్ర 
హ్మాండ నికాయ సంస్థిత మహాద్భుత గర్భ నిబద్ద రూ పిణే!
దండము భావ దూర !వినుతా!ప్రతిభాయుత !దక్షిణే శ్వ రీ!
   అమ్మా!  చండికా!ప్రచండ పరాక్రమ ప్రభామూర్తీ ,మహా ప్రళయా భ్ధి రూపిణీ!భావదూరా!ప్రతిభా స్వరూపిణీ!సర్వ ప్రపంచాన్నీ గర్భంలో   ధరించిన నీకు నమ స్కారము. ఈ విధంగా వున్న  నిన్ను     చూచేదేట్లా ? 
3  . చం -భవుడు లయింప,మాధవుడు పాలన సేయ ,సృజింప  పద్మ 
సంభవుడు ,శక్తి నీవిడక    వారికి సాధ్యమే!ఏల భ్రహ్మమే 
అవశత నీ కధీనమయియాడుట కీర్తి వహించే బ్రహ్మగా 
భవతరణీ !మహా ప్రతిభ !భావ విలక్షిణి దక్షిణే శ్వరీ!
     అమ్మా!భావతరణీ!భావ విలక్ష ణీ !మహాప్రతిభా!నీవు నీదివ్య శక్తిని ప్రసాదింప కున్న ఆ  బ్రహ్మ విష్ణు ,మహేశ్వరులు ,సృష్టి ,స్థితి, లయాలను చేయగలరా?అసలు  ఆబ్రహ్మమే నీకు స్వాధీనమై    యున్నది కదా? 
4-ఉ -అల్ప మదెట్లు నీవు జగదంబ!పరాపర శక్తి బ్రహ్మాసం 
కల్పమ !నాద బిందు కళ కాల  మహేశ్వరీ!భద్రకాళీకా!
సల్పవె నిర్గుణున్ సగుణు !సర్వమెయొఉదువు!నీవు మాయవే!
కల్పనవేయవిద్యవట కల్ల  పదంబులు!దక్షిణేశ్వరీ 

                  అమ్మా! మహేశ్వరీ!భద్ర కాళికా !బ్రహ్మ సంకల్పమా!నాదబిందు కళా స్వరూపిణీ!కాల రూపిణీ!మహేశ్వరీ!జగదంబా!పరాశక్తి!నిర్గుణ బ్రహ్మాన్ని సగుణం చేస్తున్నావు . సర్వమూ  నీవేకదా. అట్టి నీవు అల్పం ఎట్లా అవుతావు?నీవు మాయవని,కల్పనా వని ,అవిద్య వని చెప్పటం అబద్ధమే!
5-ఉ -దాత,శివుండు ,విష్ణువు సదా పరిచర్య జరించి వీడరె 
ఏ తృటి గాని నిన్ను  ,ఇక ఈశ్వరి ,లక్ష్మి,సరస్వతుల్ గుణో 
పేతవు నీదు సేవ గడు ప్రేమ మునుంగుచు నుండ్రు ,కాన నే 
రీతిగా బోలరారు సురలెవ్వరు నీకును దక్షిణే శ్వ రీ!
                         అమ్మా!బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులు మువ్వురు ,వారి శ క్తులైన వాణీ లక్ష్మి పార్వతులు మువ్వురు సద్గుణ రాశివైన నిన్ను ప్రేమతో సదా సేవిస్తూ వుంటారు. ఆ దేవతలు కూడా నీకు సరిరారు. 
6-ఉ -కాశీ గయాది క్షేత్రములు  సరస్వతీ  తీర్ధముల్ 
నీశరణొన్ది  పాదముల నిత్యమూ నుండగా వాని సంసృతీ 
పాశ విముక్తికై  వమ్ముగదా !నిను గొల్వ బూర్తిగా 
నాశము నొందు బాపమని నమ్ముదు నెప్పుడు దక్షిణే శ్వ రీ !
        అమ్మా!కాశీ   గయాది క్షేత్రాలు , క్షేత్ర స్థ గంగా, తీర్ధాలూ నీపాద పద్మాల్ని   ఆశ్రయించి ,  నిన్ను శరణు పొందగా ,యిక వాటిని    ఆశ్రయించడం ఎందుకు?నిన్ను ఆరాధిస్తే చాలు పాపం నశి స్తుందని  నా విశ్వాసమ్
7-చం -సకల చరాచరంబులు ప్రశస్తిగ నిండి యనన్యవ్రుత్తి వ్యా 
పాక గుణశక్తి బ్రేమమయవై వేలుగొండుచు నుండ నింక నే 
వికృత మనమ్బుతోభయద వ్రుత్తి జరిమ్పగా నేలనమ్మ !నీ 
ప్రకటిత వైభవంబు గన రాకనుగాదోకో !దక్షిణే శ్వరీ !
                   అమ్మా!నీవు సర్వ చరాచరములలో నంతర్గతి వై అంతటా వ్యాపించి,ప్రేమ మయివై ప్రకాశిస్తూ వుంటే ,నేను వి కారమును పొంది భయం పొందటం ఎందుకు?కారణం  నీ ప్రాశస్త్యాన్ని గ్రహించక పోవడమే!
8-ఉ -శ్రీ గుణమైన సత్వమున  సృష్టిని  బ్రేమ లయించినావు ఆ 
పైగొని రాజసంబు పరిపాలన ప్రేమతో చేసినావు ,ఉ 
ద్వేగ తమంబునన్ జగతి ప్రేమ సృ జించితి వమ్మ,కాననీ 
వేగద సృష్టి మూలము వివేకముతో గన  దక్షిణే శ్వరీ !
               అమ్మా!తమోగుణం తో ఆ  సృష్టిచేసి ,అంత రజోగుణం  రజోగుణం తో  ఆ సృష్టిని   పోషించి ,ఆ పైనశ్రే ష్టమైన  సత్వ గుణం తో   మరల    ఆసృష్టిని లయింప జెస్తున్నావు. సర్వ సృష్టికి మూల కారణం   నీవేగదా!
9-ఉ -భావ విదూరమౌ ననుభావాదులు ,వాని కతీత వీవు నిన్ 
భావన జేసి నిన్ దెలిసి వ్రాయుట సాధ్యములే !వచింప గా
బోవుట హాస్యమౌననుచు బుద్ధికి తోచుట విశ్వ సింతు నో 
పావని!భానుకోటి విభవా!పరమేశ్వరి !దక్షిణేశ్వరీ !
        అమ్మా!  పావనీ!పరమేశ్వరీ !భానుకోటి విభవా!అనుభవం భావాతీతం గదా!భావాతీత వైన ని న్ను భావించి  వ్రాయడం సాధ్యమా!ఇక నిన్ను గూర్చి   వచించుట   హాస్యా స్పదంగా   విశ్వసిస్తున్నాను
10-ఉ -అక్షర సంపుటీకరణ మౌ సకలాగమ శా స్త్ర పంక్తి నీ 
వక్షము పైని హారముగ భాసిలుగాని హృదంత రాళమున్ 
వీక్షణ చేసి చెప్పగలవే!నిజతత్వ మెరుంగనే!విశా 
లాక్షి !విమోక్ష లక్ష్మి !ఉమా!సాక్షి !సురక్షణి !దక్షిణే శ్వరీ !
                      అమ్మా!విశాలాక్షి !విమోక్ష లక్ష్మి!ఉమా!సురక్షిణి!అక్షర సమూహములతో కూడియుండు సర్వ శాస్త్ర సంచయము నీ    హృదయముపై హారముగా నున్నవి  
 కాని ఆ శా స్త్ర పంక్తి నీ హృదయాన్తరమును ,నీ నిజ తత్వాన్ని గ్రహింప గలవా!

అడివి ఆంజనేయ స్వామి నూజివీడు

on 0 comments Read Full Article

అడివి     ఆంజనేయ స్వామీ        నూజివీడు
                మాతాతగారి వూరు నూజివీడు . సాకు    దొరికి నప్పుడల్లా     వెళ్ళిపోయేవాళ్ళం ఇంటి చుట్టూ పళ్ళ చెట్లు ,పూల మొక్కలు వుండేవి. ఒపదిమంది  పిల్లలు వుండే వారు . కనకాంబరాలు,గన్నేరు పూలు,  రాధా మనోహరాలు,  జాజి పూలు , మందారాలు చెట్టు కనిపించకుండా  పూసెవి . పిల్లలు తలోపూల మొక్కా దత్తత  తీసుకొని జాగ్రత్తగా   నీళ్ళుపోసి,ఎరువులు వేసి  పెంచెవారు.
                                          మాతాత గారు కొనేటిపేట లో వుండేవారు.  పెద్దకోనేరు,మెట్లు వుండెవి. ఆగట్టు వెంటే  నదిచెవాళ్ళమ్.   అడివి   ఆంజనేయ స్వామీ   గుడి వూరికి దూరంగా  వుంటుంది .ఇప్పుదు వూరుపెరిగిపోయి  అన్తాకలిసిపొయిన్ది. కోనేటిపేట నుంచి దూరమే గుడికి వెళ్ళాలంటే    అదొక    పెద్ద ప్రయాణం . ఆవూళ్ళో ఔటింగ్లు రెండే   ,ఒకటి ఆంజనేయ స్వామీ    గుడి,రెండోది     సినిమా . ఎక్కడికన్నా వెళ్ళాలంటే   మధ్యాన్నం నుంచి ప్రయాణ సన్నాహాలు జరిగెవి.  పెరట్లోని కనకాంబరాలు కోసి   ఆంజనేయ స్వామికి    దండ  కట్టి పట్టు కెళ్ళాలి అప్పుడు అందరిచేట్ల పూలు ఇచ్చెసెవాళ్ళు  . కనకామ్బరాలుకాదాలు సన్నగా  వుంటాయి నెమ్మదిగా  దారం ముడివేసి లాగాలి లేకపోతె కత్తిరించుకు పొతాయి.   రెండుపూలు బొత్తిగా పెడితే ఒకళ్ళు మాల  ఒత్తుగా  కట్టే వారు.  నాయకత్వం,శిష్యరికం, పోట్లాటలు జరిగెవి.ఒక కొబ్బరికాయకొని పిల్లలందరం    నడిచి వెళ్ళెవాళ్ళమ్.   పరీక్ష పాస్ చేయించమని,  పండక్కి పట్టు పరికిణా    కుట్టించమని,   జడ పొడుగ్గా  ఎదగాలని  ,ఎవోకొరికలు  ఆంజనేయ స్వామికి      నివేదించే వాళ్ళం . చల్లగాగుడి ఆవరణలో కూర్చుని కొబ్బరిముక్కలు ప్రాసాదం   తిని నడిచి ఇంటికి చెరెవాళ్ళమ్.   ఆంజనేయ స్వామీ ఒక చెట్టుకింద వుండేవారు,పక్కనే వేణు  గోపాల   స్వామీ నిలబడి వుంటాడు.  ఆంజనేయ స్వామికి పైన కప్పు,ఆచ్చాదన  ఇష్టం లేదని ఏమీ   చెయ్యలెదు. ఆభరణాలు వుండేవి కావు. ఈమధ్య    పైన ఆచ్చాదనగా  కప్పువేసారు చుట్టూ గోడ  కట్టారు .మాకు ఏమిటోగా    అనిపించిన్ది.  కానీ ఇప్పటికి ఒక్కరొజుకోసమ్   వెళ్ళినా సరే   అడివి ఆంజనేయ స్వామీ దర్సనం   చేసుకోకుండా   రాము.  ఇంతవరకు అలా  జరగా లేదు.   మా  తాత గారు చనిపోయాక మా  పిన్ని గారు   యిల్లు కొనుక్కొన్నారు అందుచేత ఇప్పటికి తరుచుగా    వెడుతూనే ఉంటా మొ న్న జులై లో వెళ్లి నపుడు   ఫోటో తీసాను.