శ్రీ గణనాధం

on 0 comments Read Full Article

                            శ్రీ  గణ నాదం

 
    శ్రీ గణ నాధం     భజరే చిత్త   పరా శక్తి యుతం
    నాగ యజ్ఞ సూత్ర  ధరం    నాదలయానంద కరం    శ్రీ

   ఆగమాది సన్నుతం  అఖిల లోక పూజితం
  యోగాశాలి   భావితం భోగిశాలి సేవితం

   రాగ ద్వేషాది   రహిత రమణీయ హృదయ  విదితం
   శ్రీ గురు గుహ సమ్ముదితమ్ చిన్మూల కమల స్థితం

       తా -ఓ చిత్తమా!శ్రీ గణపతిని సేవింపుము .పరాశక్తి తో కూడుకొని యున్న  విఘ్న నాయకుని  భజింపుము .
పాములను యజ్ఞో పవీతముగా ధరించిన  వాడును ,నాదము యొక్క పరమ తత్వము లయమొందు  చోట
గ్రీడించు వాడును ,చిత్తము యొక్క అంతరంగమున   వేంచేసి యున్న వాడును,శక్తితో గూడిన వాడును నగు
గణ నాయకుని భజింపు ము .వేదములచే నుతింప బడిన వాడును -సమస్త లోకములచే  పూజింప బడిన వాడును,,యోగము తెలిసిన మహాను భావులచే ద్యానింప బడు  వాడును,  శ్రీ మహా విష్ణు వుచే పూజింప
బడిన వాడు ,నిర్మల మైన హృదయమునందానంద  రూపుడైయుండెడి వాడు,తండ్రి యైన శంకరునికి ,కుమారస్వామికి,మోదము  కలుగ    చేయు వాడు.పంచ కోశా న్తర్వర్తి అయిన పరం చైతన్య స్వరూపుడై ,గురు రూపముతో  నుండు వాడు,జ్ఞాన మూలమగు సహస్రార చక్రమున నున్డువాడునగు వినాయకునికి నమస్కరింపు ము.