నారాయణ శతకము గురుని విశిష్టత

on

                      నారాయణ శతకము

పరిష్కర్త -పాతూరి సీతారామాంజనేయులు
                                                                   
                           గురుని  విశిష్టత

వేదాంత వేదియైన,సద్గురుని- పాద పద్మములు  చెంది
యా దయానిధి కరుణచే, సద్బోధ-మందవలె   నారాయణా!

ఏవిద్యకైన గురువు,లేకున్న-నా విద్య పట్టు పడదు
 కావునను నభ్యాసము ,గురుశిక్ష -కావలెను నారాయణా!

గురుముఖంబైన విద్య ,నెన్నికై-కొనిన భావజ్ఞానము,
చిరతరాధ్యాత్మ విద్య,నభ్యసిం -పగలేదు నారాయణా!అణా

అనపేక్షకుదు సదయుడు,వేదాంతి-నిపుణు డ య్యాచార్యుడు ,
దొరకు టపురూప మపుడు,గురుతైన-గురియొప్పు నారాయణా!

అట్టి సద్గురుని వెదకి,దర్శించి -యా మహాత్ముని పదములు,
పట్టి కృతకృత్యు డౌను ,సాధకుడు -గట్టిగా నారాయణా!





0 comments:

Post a Comment