నవరాత్రి వంటకాలు,పూజలు ,రంగులు

on 3 comments Read Full Article

నవరాత్రి వంటకాలు,పూజలు,రంగులు
నవరాత్రి వచ్చేసింది.కలుష హారిణి,శక్తి స్వరూపిణి ,శత్రు సంహారిణి ,సిద్ది దాయిని మూలపుటమ్మ ముంగిలిలోకి వచ్చింది.ప్రశాంతంగా ,ప్రమోదంతో
నిండిన భక్తి విశ్వాసాలతో అమ్మను కొలవండి. లోట్లు ,సమస్యలు,చికాకులు పక్కకు పెట్టి మనసా వాచా కర్మణా దుర్గా దేవిని పూజించండి. ఏపని చేసినా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే సులువుగా వుంటుంది. ఎలాచేయాలి,ఏమిచేయాలి అనే ఆదుర్దా తగ్గుతుంది. సోదరీ లలామ లకు నాకుతెలిసిన,విన్న పద్ధతి చెపుతున్నా. బాగుంటే ,వీలయితే అనుసరించండి.
అందరికి దసరా శుభా కాంక్షలు
ఈ మాటు దసరాలు శుక్రవారంతో ప్రారంభ మవుతున్నాయి ,అందుకని శుక్ర వారం నుంచి వంటలు అవి ఏమిచేయాలో వ్రాసాను.
శుక్రవారం మొదటిరోజు -అమ్మవారికి ముద్దపప్పు ,ముక్కల పులుసు రొజూ వుండాలి,కూరలు,పచ్చళ్ళు, పిండివంటలు మారుతాయి.అందుకని పులుసు ,పప్పు అని రోజు చెప్పడం లేదు.తక్కినవి చెపుతున్నాను.
బీరకాయ కూర,చింతకాయ పచ్చడి .పులగం.మొదటిరోజు అమ్మవారికి ఆహ్వానం పలికి ప్రతిష్ట చేసేసరికి టైం పడుతుంది.అందుకని మొదటిరోజు తేలికగా పులగం చేస్తారు. ఈరోజు చిలక పచ్చ రంగు చీర ధరించాలి.ప్రతిరోజూ దుర్గా అష్తోత్తరంగాని, లలిత అష్టోత్తరం గానీ చదవాలి ,శుక్రవారం లక్ష్మికి ప్రీతి అయిన రోజుకనుక లక్ష్మి అష్టోత్తరం చదివి పూజ చేసి పాయసం నివేదన చేయాలి.
శనివారం రెండవరోజు -ఈరోజు వంకాయ కూర ,కొబ్బరి పచ్చడి, పెరుగు అన్నం నివేదన .కాషాయరంగు చీర ధరించాలి.శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రియమైన రోజు ,శ్రీ వెంకటేశ్వర స్వామీ అష్టోత్తరం చేసి ఆయనకీ చిత్రాన్నం నివేదన చేయాలి.
ఆదివారం,మూడవరోజు -సొరకాయ కూర,దోసకాయ పచ్చడి,బెల్లం అన్నం ఏలకులు,జీడిపప్పు వేసి నివేదన,పసుపు పచ్చ రంగు చీర ధరించాలి.ఆదివారం సూర్యునికి ప్రీతి ఐన రోజు సూర్యుని అష్టోత్తరం చదివి పాయసంనివేదన చేయాలి.
సోమవారం ,నాలుగవ రోజు -అరటి కాయ కూర,నేతి బీరకాయ పచ్చడి ,కొబ్బరి అన్నం నివేదన.ఆకాశ నీలం చీర ధరించాలి.సోమవారం శివునికి ప్రీతి అయిన రోజు.శివాష్తోత్తరంచదివి పాయసం నివేదన చేయాలి.
మంగళ వారం,అయిదవ రోజు-కంద కూర,బీరకాయ పచ్చడి,అన్నం పాయసం నివేదనగులాబీ రంగు చీర ధరించాలి..మంగళ వారం ఆంజనేయ స్వామికి ప్రీతి అయిన రోజు.ఆంజనేయ స్వామీ అష్టోత్తరం చదివి అప్పాలు నివేదన చేయాలి.
బుధ వారం ఆరవరోజు -చేమ దుంపల కూర ,టమాటో పచ్చడి,పులిహోర నివేదన.ఆకుపచ్చ రంగు చీర ధరించాలి.బుధవారం సరస్వతికి పూజ.అష్టోత్తరం చేసి సొజ్జ పూరీలు నివేదన .
గురువారం,ఏడవరోజు-చిక్కుడు కాయ కూర,వంకాయ పచ్చడి.సిరా రంగు చీర ధరించాలి.కలగాయకూరల అన్నం నివేదన.ఇందులో మిరియాలు,జీలకర్ర పోపు వెయ్యాలి.గురువారం సాయిబాబా కు ప్రీతి అయిన రోజు.సాయి అష్టోత్తరం చేసి,రవ్వలడ్డు నివేదన .
శుక్రవారం,ఎనిమిదవ రోజు-బెండకాయ కూర,అల్లం పచ్చడిగారెలుin నివేదన.రాయల్ బ్లూ చీర ధరించాలి.శుక్రవారం లక్ష్మికి ప్రీతి అయిన రోజు.లక్ష్మి అష్టోత్తరం చదివి చక్కర పొంగలి చేసి నివేదన చెయ్యాలి.
శనివారం తొమ్మిదవ రోజు-పనస పొట్టు కూర,లేక కాబేజీ కూర ,గోంగూర పచ్చడి,బూరెలు
నివేదన ఎర్ర రంగు చీర ధరించాలి.
ఇవన్ని మీ సౌకర్యం పట్టి ఆచరించ వచ్చు.కొత్త చీరే కట్టాలనిలేదు.
ఒకసారి కట్టిన వైనాకట్టవచ్చు .కాకపొతే ఆచీరతో భోజనం చెయ్యని దయితే చాలు.లేకపోతె పట్టు చీరలు వుండనే ఉంటాయిగా! అన్నిరంగులు ఇప్పుడు కోనేసుకోన్నరనుకోండి ఇక ఏడాది పొడుగునా మీవారిని చీరలుకొనమని
సతాయిన్చానక్కరలేదు.