శ్రవణ మహిమ

on 0 comments Read Full Article

శ్రవణ మహిమ
పరమార్ధమునకు ముఖ్య సమాధాన కారణమగు సాధనము శ్రవణము.
శ్రవణము వలన భక్తి లభించును .విరక్తి ఉత్పన్నమగును. విషయాసక్తి తగ్గి పొవును.
శ్రవణము వలన చిత్తశుధ్ధి కలుగును. బుధ్ధి ధ్రుఢ మగును. అభిమానో పాధి
తొలంగును. శ్రవణము వలన నిశ్చయము కలుగును. మమత్వము తెగిపొవును. అంత:కరణము
నందు సమాధానము జనించును. శ్రవణము వలన సందేహములు విడిపొవును. శంక లంతరించును. సద్గుణములు కలుగును. శ్రవణము వలన మనో నిగ్రహము సిధ్ధించును.
సమాధానము చేకూరును. దేహబుధ్ధి తో కూడిన బంధనములు తొలంగును. "నేను"
అను భావము దూరమగును. సందేహము దరికిరాదు. బహువిధ విఘ్నములు పటాపంచలగును.
కార్య సిధ్ధి యగును. సమాధి ఏర్పడును. మరియు పూర్ణమగు పరమ శాంతి లభించును.
సాధు సమాగమము కావించి అధ్యాత్మ శ్రవణ మొనరించుటచె వ్రుత్తి దానియందు లీనమగును. శ్రవణము వలన ప్రబొధము వ్రుధ్ధి యగును. ప్రజ్ఞ ప్రబలమగును.విషయ
పాశములు తెగిపోవును.వివేకము వచ్చును. జ్ఞానము వ్రుధ్ధినొంది బలము సమకూరును.
దాని వలన సాధకునకు వస్తు జ్ఞానము కలుగును. దుస్సాంగత్యము విడిపోవును.కామ వాసనలు క్షీణించును. ధైర్యము ప్రకాశించును. నిశ్చయాత్మకమగు సద్వస్తువు భాసమగును. శ్రవణము వలన సద్బుధ్ధి కలుగును. వివేక మతిశయించును.మనస్సు భగవంతునుయందు నాటుకొనును. మొహము నశించును. భవ భయము నాశనమగును.
ఉత్తమ గతి కలుగును. శాంతి లభించును. నివృత్తియు,అచల పదమును ప్రాప్త మగును.శ్రవణ మునకు సమాన మగు సాధన మెద్దియును లేదు.దానివలన అన్నియును సమకూరును.భవ నది తరించుటకు శ్రవణము నౌక సుమా![daasa bodha nunchi]

సంత రామదాస్

on 2 comments Read Full Article

సంత రామదాస్
సంత రామదాస్ ఒకసారి బిక్షాటన చేస్తూతిరుగుతున్నారు.
ఒక ఇంటి ముందు నిలబడి "జయజయ రఘువీర సమర్ధ " అని బిగ్గరగా కేకపెట్టారు.ఆ ఇంటి ఇల్లాలు అస్సో ఇస్సో అంటూ ఏదో పనిచేసుకొంటూంది.మధ్యలో ఈయన కేకవిని చిరాకుపడి చర్రున బయటికి వచ్చి చేతిలో వున్న అలుకు గుడ్డ పొయ్యి అలుకుతున్నది ఆయన మొహం మీద విసిరేసి"తీసుకో బిక్ష" అంది క్రోధంగా .సంత రామదాస్ సాధన్యవాదాలతో ఆ విచిత్ర బిక్ష స్వీకరించి ఆమెను ఆశీర్వదించి తన దారిన తానూ వెళ్ళిపోయాడు.ఆ బిక్షను తీసుకొని ఆయన సరాసరి నదికి వెళ్లి ఆ అలుకు గుడ్డని శుభ్రంగా వుతికారు. మఠానికి వచ్చి దానిని ఎండలో ఆరవేసి ఎండాక దానితో వత్తులు చేసి ఆవునేయితో తడిపి భగవంతునికి ఆరతి ఇచ్చేందుకు వుపయోగించారట.భగవంతుని ఇలా ప్రార్ధించారట."వట్టినుంది వచ్చే ప్రకాశం అన్ధకారాన్నేలా పారత్రోలుతుందో ఇది ఇచ్చిన అజ్నానురాలి హృదయంలోని అజ్నానాన్ధకారాన్నికూడా అలాపారత్రోలాలి ప్రభూ!"అని.ఇంకేముంది!సద భక్తుని సత్ప్రార్ధనని స్వామీ ఎప్పుడైనా నిర్లక్ష్యం చేస్తాడా?ఇలా ప్రార్ధన చెయ్యడ మేమిటి,ఆస్త్రీ హృదయం లోని అసత్ప్రవ్రుత్తులన్ని నిశ్శేషంగా దూరమయిపోయాయి.వెంటనే ఆమె అనన్య భావంతో సంత రామదాస్ దగ్గరికి వెళ్లి తను చేసిన మహాపరాదానికి వేయి క్షమాపణలు వేడుకొంది.ఆయన చూపించిన కరుణకు ముగ్దురాలయింది.భగవద్ భక్తికి అర్హురాలయింది.పెద్ద మనసున్నవారు అపకారికి ఉపకారమే చేస్తారు.

బ్రహ్మ కృత సూర్య స్తుతి

on 0 comments Read Full Article

బ్రహ్మ కృత సూర్య స్తుతి
నమస్తే దేవ దేవేశ సహస్ర కిరనోజ్వల,
లోకదీప నమస్తేస్తు నమస్తే కోలవల్లభ
భాస్కరాయ నమో నిత్యం ఖకోల్కాయ నమో నమ: ,
విష్ణవే కాల చక్రాయ సోమాయామిత తేజసే
నమస్తే పంచకాలాయ ఇంద్రాయ వాసు రేతసే
ఖగాయ లోక నాథాయ ఏక చక్ర రాధాయచ
జగద్ధితాయ దేవాయ శివాయామిత తేజసే
తమోఘ్నాయ సురూపాయ తేజసాం నిధయే నమ:
అర్దాయ కామ రూపాయ ధర్మాయామిత తేజసే
మోక్షాయ మోక్ష రూపాయ సూర్యాయచ నమో నమ:
క్రోధలోభ విహీనాయ లోకానాం స్థితి హేతవే
శుభాయ శుభ రూపాయ శుభదాయ శుభాత్మనే
శాంతాయ శాంత రూపాయ శాంతయే స్మాసు వై నమ:
నమస్తే బ్రహ్మ రూపాయ బ్రాహ్మనాయనమో నమ:
బ్రహ్మ దేవాయ బ్రహ్మ రూపాయ బ్రాహ్మనే పరమాత్మనే
బ్రహ్మనేచ ప్రసాదం వై కురు దేవ జగత్పతే
జయ భావ జయా జేయ జయ హంస దివాకర
జయ శంభో మహాబాహో ఖగ గోచర భూధర
జయ లోక ప్రదీపాయ జయ భానో జగత్పతే
జయ కాల జయానంత సంవత్సర శుభాననా
జయ దేవాదితే: పుత్ర కశ్యపానంద వర్ధన
తమోఘ్న జయ సప్తేశ జయ శప్తాస్వ వాహన
గ్రహేశ జయ కాన్తీశ జయ కాలేశ శంకర
అర్ధ కామేశ ధర్మేశ జయ మోక్షడ శర్మద
జయ వేదాంగ రూపాయ గ్రహ రూపాయ వై నమ:
సత్యాయ సత్య రూపాయ సురూపాయ శుభాయచ
క్రోధలోభ వినాశాయ కామ నాశాయ వై జయ
కల్మాష పక్షి రూపాయ యతి రూపాయ శంభవే
విశ్వాయ విశ్వ రూపాయ విశ్వ కర్మాయ వైఇ జయ
జయోన్కార వషట్ కార స్వాహాకార స్వదామయ
జయాశ్వ మేధ రూపాయ చాగ్ని రూపార్య మాయ చ
సంసారార్ణవ పీతాయ మోక్ష ద్వారా ప్రదాయచ
సంసారార్ణవ మగ్నస్య మామ దేవ జగత్పతే
హస్తావలంబనో దేవ భవత్వం గోపతేద్భుత
నమామి దేవ దేవేశం భూతభావన మవ్యయం
దివాకరం రవిం భానుం మార్తాండం భాస్కరం భగం
ఇంద్రం విష్ణుం హరి హంసమర్క లోక గురుం విభుం
త్రినేత్రమ త్ర్యక్షరం త్రయంగం త్రిమూర్తిం త్రిగతిం శుభం
శన్ముఖాయనమో నిత్యం త్రినేత్రాయ నమో నమ:
చతుర్వింశతి పాదాయ నమో ద్వాదశ పాణయే
నమస్తే భూత పతయే లోకానాం పతయే నమ:
దేవానాం పతయే నిత్యం వర్ణానాం పతయే నమ;
త్వం బ్రహ్మ త్వం జగన్నాదో రుద్రస్త్వంచ ప్రజాపతిహి:
త్వం సోమస్త్వం తథాదిత్య స్త్వమొంకారక ఎవహి
బృహస్పతిర్బుధస్త్వం హి త్వం శుక్రస్త్వం విభావసు:
యమస్త్వం వరునస్త్వం హి నమస్తే కశ్య పాత్మజ
లయాతత మిదం సర్వం జగస్తావర జంగమం
తట్ట ఎవ సముత్పన్నం సదేవాసుర మానుషం
బ్రహ్మా చాహం చ రుద్రశ్చ సముత్పన్నో జగత్ పతే
కల్పాదౌతు పురా దేవ స్తితయే జగతోనఘ
నమస్తే వేద రూపాయ అహొరూపాయ వై నమ:
నమస్తే జ్ఞాన రూపాయ యజ్ఞాయచ నమో నమ:
ప్రసీదాస్మాసు దేవేశ భ్రుతేషు కిరనోజ్వల
సంసారార్ణవ మగ్నానాం ప్రసాదం కురు గోపతే
వేదాన్తాయ నమో నిత్యం నమో యజ్న కలాయచ







:


శ్రీ శారదా త్రిశతి స్తవ:

on 0 comments Read Full Article

శ్రీ శారదా త్రిశతి స్తవ:
ప్రాతస్మరామి తవరూప మమేయ భూషా
సందోహ రమ్య కిరనోజ్వల మంబ దివ్యం
దేదీప్యమాన శరదిందు కళా కిరీటం
దివ్యామ్బర స్రగనులేపన శోభ మానం

ప్రాత ర్వదామి తవనామ రసజ్ఞాయాగం
వాగీస్వరీతి వరదేతి సరస్వతీతి
వాణీతి వాగితి చతుర్ముఖ వల్లభేతి
శ్రీ శారదాంబ సురగీరితి భారతీతి
ప్రాతస్మరామి తవ భారతి!బాహువల్లీ
ర్వీనాక్ష సూత్ర విశ దోజ్వల పుస్తకాధ్యా :
కేయూర కంకణమనోహర దివ్య కాంతి
రాత్నాన్గులీయక కరాన్గులిరమ్య శోభా:
ప్రాతర్నమామి చరణాంబుజ మంబ !తేహం
శ్రీ శారదే !సరిత జనావన బద్ధ దీక్షం
శీఘ్రం భవంతి హి యదేవ సక్రుత్ప్రనమ్య
శీర్నా జడా ఆపి శిరో మనయే బుధానాం
ప్రాతర్ వ్రజామి శరణం ప్రనతార్తి హన్త్రీం
ప్రానేశ్వరీం భగవత: ప్రయతో విధాతు:
వీనాక్ష సూత్ర శుక పుస్తక రమ్య పాణీం
వాణీ మమూల్య సుమ మాల్య మనోజ్ఞా వేణీం
ప్రాతర్ భజామి వినత:ప్రాణ వాసన స్తాం
ప్రాజ్నై ర్వశిష్ట శుక కశ్యప నారదాద్యై
శ్రీ శారదాం శ్రుత పదాం హృది కాళిదాస
బాణాభి నంద భవ భూతి మఖైరాపిత్వాం
రచయిత
శ్రీ చింతలపాటి .వీర నీల కంట కుటుంబ రామ శాస్త్రీ సిద్ధాంతి