శివ స్తుతి

on 0 comments Read Full Article



ప్రాతః స్మరామి భవ భీతి హరం సురేశం
గంగాధరం వృషభ వాహనం అంబికేశం
ఖట్వాంగ శూల వరదాభయ హస్తమీశం
సంసార రోగ హరమౌషధమద్వితీయం

ప్రాతః నమామిగిరిశం గిరిజార్ధ దేహం
స్వర్గ స్థితి ప్రళయ కారణమాది దేవం
విశ్వేశ్వరం విజిత విశ్వ మనోభి రామం
సంసార రోగ హరమౌషధమద్వితీయం

ప్రాతః భజామి శివమేకమనంతమాద్యం
వేదాంత వేద్యమనఘం పురుషం మహాంతం
నామాది బేధ రహితం చ షట్ భావ శూన్యం
సంసార రోగ హరమౌషధమద్వితీయం

ప్రాతః సముత్థాయ శివం విచింత్య
శ్లోకత్రయం యేనుదినం పఠంతి
తే దుఃఖ జాతం బహు జన్మ సంచితం
హిత్వా పదం యాంతి తదేవ శంభో !


దేవి ఆరాధన

on 1 comments Read Full Article


అమ్మవారి అర్చన
**************************************

అంబ రాజ రాజేశ్వరిని, భక్తిగా మదిలో తలచెదమమ్మా!
అష్టాదశ పీట సువాసినికి, అర్చన చేదము రారమ్మా !

లంకలో వెలసిన శాంకరి దేవికి, తలంటి నీళ్లు పోసేదమమ్మా!
కాంచీపుర శ్రీ కామాక్షమ్మకు, కాంచన చేలము కట్టెదమామ్మా!

వంగ దేశపు శృంఖల దేవికి, కుంకుమ తిలకము దిద్దెదమమ్మా!
క్రౌంచ పురమున చాముండాంబాకు, పాపట సింధురముంచెదమమ్మా!

అలంపురీ జోగులాంబకు, పసుపు పారాణి పెట్టెదమమ్మా!
శ్రీ పర్వత భ్రమరాంబికకు, కాటుక కళ్ళకు దిద్దెదమమ్మా!

అంబ రాజ రాజేశ్వరిని, భక్తిగా మదిలో తలచెదమమ్మా!
అష్టాదశ పీట సువాసినికి, అర్చన చేదము రారమ్మా !

కొల్హాపురి మహాలక్ష్మిదేవికి, గజ్జెల గాజులు కూర్చెదమమ్మా!
మాహుర్యేక వీర మాతకు, బంగారు నగలు పెట్టెదమమ్మా!

ఉజ్జయినీ పురి కాళికాంబకు ,జాజులు జడలో తురిమెదమమ్మా!
పిఠాపురమ్మున పురుహూతికకు, మంచి గంధము పూసేదమమ్మా!

భౌజ పురమున గిరిజా దేవికి, కల్యాణార్చన చేసెదమమ్మా!
ద్రాక్షారామ మాణిక్యాంబకు, పరిమళ ధూపము వేసెదమమ్మా!

అంబ రాజ రాజేశ్వరిని, భక్తిగా మదిలో తలచెద మమ్మా!
అష్టాదశ పీట సువాసినికి, అర్చన చేదము రారమ్మా !

హరిపురి శ్రీ కామ రూపిణికి, పాలు ఫలములు ఒసగేదమమ్మా!
ప్రయాగ మాధవేశ్వరికి, పాయస సమర్పణ చేసెద మమ్మా!

జ్వాలాముఖి శ్రీ వైష్ణవి దేవికి, దక్షిణ తాంబూల మిచ్చెద మామ్మా!
గయలో మంగళ గౌరీ దేవికి, జయ నీరాజన మిచ్చెద మమ్మా!

వారణాశి శ్రీ విశాలాక్షికి, వాహన సేవలు చేసెదమమ్మా!
కాశ్మీరంబున సరస్వతి మాతకు, నమ: శ్శతంబులు చేసెదమమ్మా!

అంబ రాజ రాజేశ్వరిని, భక్తిగా మదిలో తలచెద మమ్మా!
అష్టాదశ పీట సువాసినికి, అర్చన చేదము రారమ్మా !
***************************************


పద్దెనిమిది పీటాలలో వెలసిన పరమేశ్వరిని షోడశోప చార పూజ చేసేందుకు ఈ పాట కూర్చ బడింది. ఈ పాత పాట వ్రాసిన దేవరో తెలియదు కాని అందంగా వ్రాసారు. ఇది చదివి అమ్మకు మానసిక పూజ చేసుకోవచ్చు.కార్తిక మాసం పుణ్యమైన మాసం.భక్తి ప్రపత్తులకు అనువైన మాసం.ఈమాసమంతా ,మరీ పౌర్ణమిదాకా అన్ని ముఖ్య మైన తిథులే! సోమవారాలు అభిషేకాలు,క్షీరాబ్ధి ద్వాదశి , ఏకాదశి ,కార్తీక పౌర్ణమి అన్నీ ఇట్టే గడిచిపోతాయి. వన భోజనాలు పుణ్యము, పురుషార్దము అన్నట్లుగా ,అందరు కలిసి భోజనాలు చేయడం, సామూహికంగా పూజలు చేసుకోవడం నయనానంద కరంగా వుంటాయి. నీరెండలో కూర్చుని ఉత్తమ గ్రంధాలు చదవడం,ఇతరులకి వినిపించడం మనశ్శాంతిని కలిగిస్తుంది.భగవదారాధనకి సమయం నిర్ణయించ నక్కరలేదు. `మనం పడుకొని ప్రార్ధిస్తే ఆయన కూర్చుని విన్టాడట. హరి హరుల నిద్దరిని పూజించే కార్తీక మాసం పుణ్యాన్ని పంచి పెడుతుంది.

on 1 comments Read Full Article



తులసి స్తోత్రము

on 1 comments Read Full Article

తులసి స్తోత్రము

దీపావళి వెళుతూనే కార్తిక మాసం ,స్నానాలు,ఉపవాసాలు,శివ మహాదేవునికి అభిషేకాలు, బిల్వపత్రార్చనలు ,కార్తిక దీపం ఒకటే సంరంభం. తులసి దగ్గర నెలరోజులు దీపం వెలిగించి "సర్వే జనా స్సుఖినో భవంతు "అని ఆశిర్వదించ మని ఆతల్లిని ప్రార్దిస్తాము.క్షీరాబ్ధి ద్వాదశి నాడు తులసి కల్యాణం .ఆ సందర్భముగా తులసి స్తోత్రము చదువుకోండి.
తులసి స్తోత్రము
జగద్ధాత్రి నమస్తుభ్యం విశ్ణోచ ప్రియ వల్లభే!
యతో బ్రహ్మాదయో దేవ:సృష్టిస్తిత్యంత కారిణ:
నమస్తులసి కల్యాణి నమో విష్ణు ప్రియే శుభే
నమో మోక్ష ప్రదే దేవి నమ: సంపత్ప్రదాయికే
తులసి పాతుమాం నిత్యం సర్వాపద్యోపి సర్వదా
కిర్తితా వాపి స్మృతా వాపి పవిత్రయతి మానవం
నమామి శి రాసా దేవిం తులసీం విలసత్తమం
యాం దృష్ట్వా పాపినో మర్త్యా:ముర్చ్యన్తే సర్వ కిల్బిశాత్
తులస్యా రక్షితం సర్వం జగదేత చ్చరాచరం
యా వినర్హంతి పాపాని దృష్ట్వా పాపి భిర్నరై:
నమస్తూ లస్యతి తరాం యస్యై బాధ్వాబలిమ్తతా
కాలయంతి సుఖం సర్వం స్త్రియో వైశ్యా స్తదాపరే
తులస్యన్నపరం కించిత్ దైవతం జగతి తలే
యాయా పవిత్రతో లోకో విష్ణు సంగేన వైష్ణవ:
తులస్యాం పల్లవం విష్ణో శిరస్యారోపితం కలౌ
ఆరోపయతి సర్వాణి శ్రేయామ్సి వర మస్తకే
తులస్యాం సకలా దేవా వసంతి సతతం యత:
అతస్తా మర్చయే లోకే సర్వ దేవాన్పమర్చయన్
నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమ వల్లభౌ
పాహిమాం సర్వ పాపెభ్యం సర్వ సంపత్ప్రదాయికే
ఇతి స్తోత్రం పురా గీతం పున్డరీకేణ ధీమతా
విష్ణు మర్చయితా నిత్యం సోభావై స్తులసి దలై :
తులసీ శ్రీ మహా లక్ష్మి విద్యా విద్యా యశస్విని
ధర్మ్యా ధర్మ నవాదేవి దేవ దేవ మన: ప్రియా
లక్ష్మి ప్రియ సఖి దేవి ద్యౌర్భూమి రచలా చలా
షోడా శైతాని నామాని తులస్యాం కిర్తయన్నర:
లభతే సుతరాం భక్తి మన్తే విష్ణు పదం లభేత్
తులసీ భూర్మహా లక్ష్మి:పద్మినిశ్రీ ర్హరిప్రియా
తులసీ శ్రీ సఖి శుభే పాప హారిణి పుణ్య దే
నమస్తే! నారద నుతే! నారాయణ మన: ప్రియే హ్రీం
**********************


శ్రీ రామాస్టొత్తరమ్

on 0 comments Read Full Article

ఓంశ్రీరామాయనమ:
ఓంరామభద్రాయ నమ:
ఓంరామ చంద్రాయ నమ:
ఓంశాశ్వతాయ నమ:
ఓం రాజీవ లొచనాయ నమ:
ఓం శ్రీమతె నమ:
ఓంరాజెంద్రాయనమ:
ఓంరఘు పుంగవాయ నమ:
ఓంజానకి వల్లభాయనమ:
ఓంజైత్రాయనమ:
ఓంజితామిత్రాయనమ:
ఓంజనార్దనాయనమ:
ఓం విశ్వామిత్ర ప్రియాయనమ:
ఓందాంతాయ నమ:
ఓం శరణ త్రాణా తత్పరాయనమ:
ఓంవాలిప్రమధ నాధాయ నమ:
ఓం వాగ్మినెనమ:
ఓం సత్య వాచినెనమ:
ఓం సత్య విక్రమాయ నమ:
ఓం సత్య వ్రతాయ నమ:
ఓం వ్రత ధరాయ నమ:
ఓం సదా హనుమదాశ్రితాయ నమ;
ఓంకౌసలెయాయ నమ:
ఓంఖర ధ్వంసినె నమ:
ఓంవిరాధ వధ పండీతాయ నమ:
ఓం విభీషణ పరిత్రాణాయనమ;
ఓం హరి కొదండ ఖండనాయ నమ:
ఓం సప్త తాళ ప్ర భెత్తాయనమ:
ఓం దశాగ్రీవశిరొహరాయనమ:
ఓం జామదగ్నమహాదర్పదళానాయనమ:
ఓం తాటకానతకాయనమ్హ్
ఓంవేదాంత సారాయనమ:
ఓం వేదాత్మాయనమ:
ఓం భవరొగస్య భేషజాయనమ:
ఓం దూషన ష్టిరోహత్రే నమః :
ఓంత్రిమూత్రయేనమ:
ఓం త్రిగుణాత్మకాయనమ:
ఓం త్రివిక్రమాయనమ:
ఓంత్రిలొకాత్మాయనమ:
ఓంపుణ్య చారిత్ర కీర్తనాయనమ:
త్రిలొకరక్షకాయనమ:
ఓం ధన్వినే నమ:
ఓం దన్దాకారణ్య కర్త నాయ నమ:
ఓమహల్యాశాపశమనాయనమ:
ఓంపిత్రు భక్తాయనమ:
ఓం వరప్రదాయనమ:
ఓం జితెన్ద్రియాయ నమ:
ఓం జిత క్రొధాయనమ:
ఓంజితా మిత్రాయ నమ:
ఓం జగద్గురవే నమ:
ఓమృక్షవానర సంఘాతినే నమ:
ఓం చిత్ర కూత సమాశ్రితాయ నమ:
ఓంజయంత త్రాణవరదాయనమ:
ఓంసుమిత్రాపుత్ర సేవితాయనమ:
ఓం సర్వ దేవాది దేవాయ నమ:
మ్మ్రుత వానర జీవనాయనమ:
ఓం మాయామరీహంత్రే నమ:
ఓం మహాదేవాయ నమః
ఓం మహాభుజాయనమ:
ఓం సర్వ దేవ స్తుతాయనమ:
ఓం సౌమ్యాయ నమ:
ఓం బ్రహ్మణ్యాయనమ:
ఓం ముని సన్స్తుతాయనమ:
ఓమ్మహాయొగినే నమ:
ఓమ్మహోదారాయనమ:
ఓం సుగ్రీవేప్సిత రాజ్యదాయనమ:
ఓం సర్వ పుణ్యాధిక ఫల దాయనమ:
ఓం సర్వాఘ నాశనాయనమ:
ఓం ఆది పురు షాయనమ:
ఓం పరమ పురుషాయ నమ:
ఓంపుణ్యొదయాయ నమ:
ఓం దయాసారాయ నమః :
ఓం పురాణ పురుషొత్తమాయనమ:
ఓంస్మిత వక్త్రాయ నమ:
ఓం మిత భాషిణేనమ:
ఓంపూర్వ భాషిణే నమ:
ఓం రాఘవాయనమ:
ఓం అనంత గుణ గంభీరాయ నమ:
ఓం ధీరొదాత్తాయనమ:
ఓం గుణొత్తమాయనమ:
ఓం మయా మానుష చారిత్రాయ నమ:
ఓమ్మహాదేవాది పూజితాయ నమ:
సేతు క్రుతే నమ:
ఓం సిత వారాసియే నమ:
ఓం సర్వ తీర్థ మయాయ నమ:
హరయే నమ:
ఓం శ్యామాంగాయ నమ:
ఓం సుందరాయనమ:
శూరాయనమ:
ఓం పీత వాసాయ నమ:
ఓంధనుర్ధరాయ నమ:
ఓం సర్వయ`జ్ఞాధి పాయనమ:
ఓం యజ్వినే నమ:
ఓం జరామరణ వర్జితాయనమ:
ఓం విభీషణ ప్రతి ష్తాత్రే నమ:
ఓం సర్వాపగుణ వర్జితాయనమ:
ఓం పరమాత్మాయనమ:
ఓంపర బ్రహ్మణే నమ:
ఒం సచ్చిదానంద విగ్రహాయనమ:
ఓంపరస్మైధామ్నే నమ:
ఓంపరాకాశాయనమ:
ఓంపరాత్పరాయ నమ:
ఓం పరేశాయ నమ:
ఓంపారణాయనమ:
ఓంపారాయ నమ:
ఓం సర్వ దేవాత్మ కాయ నమ:
ఓం పరస్మై నమ:

రాముని పై పాట

on 0 comments Read Full Article

రాములవారి మీద ఒక పాత పాట మీకు అందిస్తున్నాను.
చక్కాని వాడవయ్య రామా రామా
మోమొక్కసారి జూపవయ్య రామా రామా
మోమొక్కసారి జూపవయ్య రామా రామా
పట్టు పీతాంబరములు రామా రామా
మాకు కట్టీ దర్శనమివ్వు రామా రామా
శంఖు చక్రముల తోడ రామా రామా
వేగ సాక్షాత్కరింపవయ్య రామా రామా
వామాంకమున సీత రామా రామా
వేగ వదలకుండ రాగదొయి రామా రామా
గజ్జెలందెలు మ్రోగ రామా రామా
వేగ ఘల్లు ఘల్లు రాగదొయి రామా రామా
భద్రాద్రి పుర నివాసా రామా రామా
వేగ భక్తులను బ్రొవుమయ్య రామా రామా
సమాప్తము.

శ్రీ షిర్డీ సాయిబాబా అష్టోత్తర శతనామావళి

on 0 comments Read Full Article

శ్రీ షిర్డిసాయి

అష్టోత్తరశతనామావళి

రచన టి.జ్ఞాన ప్రసూన
1ఓం సాయినాథాయ జగద్గురువే నమోనమ:

2 పతితపావనాయ ''
3'' మోక్షదాయ ''
4'' అయోనిజాయ ''
5'' ఆత్మవివర్ధకాయ ''
6''ఆనంద దాయకాయ ''
7'' సర్వప్రాణిరక్షకాయ ''
8'' అసత్యఖండనాయ ''
9'' జీవకారుణ్యప్రముఖాయ ''
10'' భక్తజనకరతలామలకాయా'
11'' సతతాగ్నిహోత్రాయ ''
12'' కించిత్ ప్రసాదసంతుష్టాయ ''
13'' ఉదీ మహామంత్రాయ ''
14'' ఉదీమహాప్రసాదాయ ''
15'' షిర్డీతారకాయ ''
16'' షిర్డీనివాసాయ ''
17'' షిర్డీస్థిరనివాసాయ ''
18'' బాలరూప ప్రకటాయ ''
19''సర్వమత సమ్మతాయ ''
20 ''భక్తజనాభీష్టదాయ ''
21'' సులభప్రసన్నాయ ''
22'' ధునీస్వామినే ''
23'' సర్పనియంత్రణాయ ''
24'' జీవజాల అన్నదానప్రేరణాయ ''
25'' అమృతతుల్యవాక్పతయే ''
26'' లడ్డూరసికాయ ''
27'' డోలాప్రియాయ ''
28'' ద్వంద్వ రహితాయ ''
29''పూర్వఋణ విముక్తి శ్రేష్టాయ
30'' భక్త రోగ భరణాయ ''
31'' భక్త రోగానివారనాయ ''
32'' సర్వజ్ఞాయ ''
33'' సమస్తజనాంతరంగ నిరీక్షణాయ ''
34'' ధర్మవివర్ధనాయ ''
35''దర్మసంపన్నాయ ''
పేజి 2
36ధర్మదాత్రే నమో నమ
37 అంధత్వనిర్మూలాయ ''
38వికలాంగజనోధ్ధరణాయ ''
39సామాన్యరూపాయ ''
40అసమాన్యతేజసే ''
41పతాకోత్సవహర్షాయ ''
42చందనోత్సవనిర్మాత్రే ''
43ఆగ్రహపూరితారబ్ధకార్యాయ ''
44అనుగ్రహప్రదాయ ''
45ద్వారకామాయినిలయాయ ''
46కామనాశనాయ ''
47శాంతిప్రదాయ ''
48సత్కర్మప్రేరకాయ ''
49దీనజనోధ్ధారకౌతుకాయ ''
50సత్య మూర్తయే ''
51ఘనాశీర్వాదహస్తాయ ''
52దారిద్ర్యప్రసన్నాయ ''
53ధనవిరక్తాయ ''
54నింబవృక్షమూలసంస్థితాయ ''
55సుందరనటనాయ ''
56సౌమ్యసంగీతాయ ''
57నిత్యాగ్నిహోత్రాయ ''
58శంఖాంకితపదాయ ''
59తామరపుష్పాంకితపాదాయ ''
60యోగసంగతాయ ''
61పుష్పవనప్రియాయ ''
62ఆనందనాథ కీర్తనాయ
౬౨ఆనన్దనాధ కీర్తనాయ నమ;
౬౩శ్రీ సాయినాదాయ ''
౬౪సార సారాయ "
౬౫ఉదారస్వభావాయ "
౬౫యొగనిద్రాయ "
౬౬సముద్రాన్తరన్గాయ "
౬౮మార్గ దర్సకాయ "
౬౯సమస్త హృదయాయ "
సృష్టి స్థితి లయకారాయ "
శిష్య వత్సలాయ "



71శిష్య వత్సలాయ నమో నమ;
72ప్రేమ స్వరూపాయ ''
73సచ్చరిత్రాయ ''
74శుధ్ధ చైతన్య దాయకాయ ''
75జ్ఞానాలంకారదాత్రే ''
76అవిద్యా నాశనాయ ''
77నామస్మరణప్రియాయ ''
78శరణాగత రక్షకాయ ''
79భక్తగమననిర్ణయాయ ''
80సందేహ నివృత్తాయ ''
81మాతృవాత్సల్యాయ ''
82గంగాయమునాజలపాదాయ ''
83మాయానిర్మూలనాయ ''
84 శృంగార రూపాయ ''
86గురువాసరప్రియాయ ''
87శుక్రవాసర ప్రియాయ ''
88దర్శనమాత్ర సంతొష ప్రదాయా'
89సమాధిమందిర స్థాయిరూపాయ ''
90మితభాషాయ ''
91అహంకార ఖండనాయ ''
92భక్తిప్రముఖాయ ''
93దీర్ఘమౌనాయ ''
94పరకాయప్రవేశాయ ''
95శుష్రూషాప్రియాయ ''
96యోగనాథాయ ''
97మాతృస్వరూపాయ ''
98ఆదిమధ్యాంతరహితాయ ''
99నిజ దృష్టిప్రదాయకాయ ''
100పవిత్రపాదాయ ''
101శాంతస్వరూపాయ ''

102ప్రసన్నచిత్తాయ ''
103శిష్యసమ్ముఖాయ ''
104ఆశ్రితరక్షకాయ ''
105ఆత్మజ్ఞానప్రదాయ ''
106అనంతశక్తిప్రదాయ ''
౧౦౭ శ్రీ షిర్డీ సాయినాదాయ ''
108జ్ఞానప్రసూనార్చితపాదాయ
సమాప్తం
రచనటి .జ్ఞాన ప్రసూన

దసరా శుభాకాంక్షలు

on 0 comments Read Full Article

దసరా శుభాకాంక్షలు త. జ్ఞాన ప్రసూన

మంగళ హారతి

on 0 comments Read Full Article

మంగళ హారతి
హారతీ గొనుము తల్లీ తల్లీ సద్గుణ వల్లి హారతి గొనుము తల్లి !
స్నానాము చేయిన్తు జ్ఞానమాంబరో రమ్ము వేళ మించెను సుమ్ము
వెలది కొలది వేడుకా కొలది హా
పసుపు కుంకుమ పచ్చ నక్షింతలచే నిన్ను బాగుగా పూజించెద
బాలా ఇలా జాలము ఎలా హా
మల్లెలు మొల్లలు మంచి సంపెంగలు కొల్లలుగా పూజింతును
కాలా మిలా గడపుట ఎలా హా
కండచక్కెర తేనే కదళి ఫలంబులు కామాక్షి కర్పించెద
బాలా ఇలా జాలము ఎలా హా
మహాదేవు రాణీ రో మహానైవేద్యంబిదుగో మంత్ర పుష్పము లివిగో
మాతా !నన్ను నీతావు చేర్చుకో హా

శ్రీ షిర్డీ సాయి సూక్తి

on 0 comments Read Full Article

శ్రీ షి ర్డీసాయి సూక్తులు
దాసగణు షి రి డీ వెడుతూంటే కోపర్ గావ్ లో స్టేషను మాస్టరు సాయిని
పిచ్చి ఫకీరని నిందించాడు.బాబాను స్వయంగా చూచి మాట్లాడమని చెప్పి,దాసగణు అతనిని శిర్దీ తీసుకు వచ్చాడు.సాయి మసీదులోని కుండలన్ని బోర్లిస్తున్నారు.కారణమడిగిన స్టేషను మాష్టరి తో "నాదగ్గరకు వచ్చే కుండలన్ని తలక్రిందులుగానే వస్తున్నాయి"అంధ మైన అవిశ్వాసం తో వచ్చేవారి హృదయాలు బోర్లించిన కుండలు,వాటిని జ్ఞానం తో నింపడం సాధ్యం కాదు.విశ్వాసం తోకానీ లేక కనీసమ్ జిజ్ఞాస తోగాని వచ్చే వారి హృదయాలు సరియైన కుండలు,వాటిని నింపవచ్చు.
చిత్ర మేమిటంటే ఆ మాటతో సాయి అతని హృదయమనే కుండను సరిచేసి విశ్వాసం నింపి పంపారు .

on 0 comments Read Full Article

స్తుతి
కుల కుండే ప్రణవంతీ చేతంతీ హృదిసమస్త జంతూనాం
మూర్ధని విచింత యంతీ మృత్యంజయ మహిషి విజయతే భవతి
మూలాధారంలో శబ్దిస్తూ, అనాహతం లో భాసిస్తూ,
సహస్రారంలో భాసించే తల్లీ....నీఆరాధనవల్ల జీవులు
మృత్యువును జయిస్తారు అని భావం.

on 0 comments Read Full Article

శ్రీసూక్త విధానం పూజ కీర్తన రచన నారాయణి
చంద్ర భానులతొ, సూర్య భానులతొ జేగంటలతొనూ
పరాకు తెల్పుచు, పరాభట్టారికను తీసుకు వచ్చితినే
దయచేయుము శ్రీరాజ రాజేశ్వరి సేవకు వేళాయె నీ
పూజకు వేళాయె ప్రదొష కాలము చరణము లియ్యగదే
ధ్యానము చేయుచు, ఆవాహనముతొ అంబ నీకు ఇదిగొ
రత్న సిమ్హాసన మిచ్చుచు నీకు పాద్యము నిచ్చెదనే
అర్ఘ్యము ఆచమనీయము పంచామృత స్నానములతొ
వస్త్రమిచ్చితిని యగ్నొపవీతము అందుకొనంగదవే
కంచుక ఆభరణములు తెచ్చి కాంతరొ ఇచ్చితినే
అందముగానూ అలంకరించెద ఆదరించ వమ్మా



సరస్వతి ప్రార్ధన

on 0 comments Read Full Article

శ్రీ సరస్వతీ శతకము
రచన - శ్రీమతి చేబ్రోలు సరస్వతి
సురుచిర వీణ హస్తమున*సొంపుగ దాలిచి నాల్గు వేదముల్
వరలగ మీటుచుంబరం*భక్తుల పాలిట కల్పకంబ వై
సరసిజగర్భ సంభవుని* స్వాంత నికేతనమందు నిచ్చలున్
తిరముగ నిల్చి తేజరిలు *దేవి !కృపామతి శ్రీ సరస్వతీ !

సత్య సాయి బాబా అష్టకం

on 1 comments Read Full Article

సత్య సాయి బాబా అష్టకం
రచన టి.జి. ప్రసూన


పర్తి పురమున వెలసినావట
పాపులను రక్షించగా
ఆర్తి బాపగా అవతరించిన
ఆదిమూర్తివి నీవట
కర్తవు కర్మవు నీవే
కామితము లందింపవా ని
వ్రుత్తి భావము నింపవా మది
సత్య సాయి మహేశ్వరా (పర్తి )
సత్య , ధర్మమూ , శాంతి , ప్రేమయు
నాల్గు చక్రము లంటివి
నిత్యమౌ శమము , దమమను
జోడు ఎద్దుల గడితివి
క్రుత్యమే నీ విధి , ఫలమ్మును
కోరవద్దని అంటివి
భ్రుత్యులను కడ తీర్చవా మరి
సత్య సాయి మహేశ్వరా (పర్తి )
గట్టివాడవు , పోట్టివాడవు
పుట్ట పర్తిన్ పుట్టితీ
కట్టినాడవు హర్మ్య భవనాల్
మేట్టినాడవుమేలి శిఖరాల్
చుట్టి నాడవు చేయి గాలిలో
మట్టి చక్కర చేయగా
ఇట్టి లీలలు ఎన్నియో మరి
సత్య సాయి మహేశ్వరా (పర్తి )
భక్త జన చింతామణి
సద్భక్త హృదయ శిఖామణి
శక్తి రూప మహా ఫణి
సంసక్తి నిర్గుణ గ్రామణి
ముక్తి నీయుము మొదమియుము
వ్యక్త భావము లేరుగుమీ ,వి
ముక్తి చేయవే భంధనములను
సత్య సాయి మహేశ్వరా (పర్తి )
నోచ్చు కనులను , పుచ్చు తనువుల
రగులు ఎదలను , పగులు మదిని
హేచ్చుగాను విభూతి ఇచ్చుచు
హి !ప్రభో దయ చూడవా
ఇచ్చినావట్ వచ్చు వారికి
ఆత్మా లింగము లాదిగా
మేచ్చినారట మేలుగా మరి
సత్య సాయి మహేశ్వరా (పర్తి )
వన్నె తరగని శాంతి ,సౌఖ్యము
వసుధ లోపల నింపగా
పిన్నతనమున మిన్నగా
చిన్నేలూ చూపిన శ్రీనిదీ
గున్నమావి చెట్టు నీడన
పన్నగేషుని పదమూపై
ఎన్నగా కవితలు పలికిన
సత్య సాయి మహేశ్వరా (పర్తి )
త్రిగుణ ములను జయించి
బ్రహ్మను చేరగావలె మానవుల్
సుగుణ ములను వరించి
సేవలు చేయగా వలె సోదరులు
సగుణ నిర్గుణ మూర్తి
మంగళ దాయి ,మధురానందకా
నిగమనుత కాషాయ దారి శ్రీ
సత్య సాయి మహేశ్వరా (పర్తి )
చతుర వాక్పరిపాలకా
చిద్రూప శ్రీ శిర్దిస్వరా
అతుల భద్ర గునార్ణవా
శ్రిత జనేప్సిత దాయికా
గతుకులన్బడి పోవు బ్రతుకుల
గాచి బ్రోవవ పెమతో
జ్ఞాన వ్రాసిన అష్టకంబును
స్వీకరింపవా ప్రేమతో a
సత్య , శివ , సుందర త్రిమూర్తివి శ్రీ
సత్యసాయి మహేశ్వరా (పర్తి )
samaaptam

లక్ష్మి స్తుతి

on 0 comments Read Full Article

లక్ష్మి స్తుతి
పావన చరితా !సద్గుణ భరితా!
వరదాయకి హే!త్రిలోకమాతా!
నిత్యకల్యాణీ !నిగమ సంచారిణి !
సత్య స్వరూపిణి !శ్రీహరిరాణీ !
అత్యంతము మా అంతరంగంబున
నిత్యముగా నిను నిలపి భజింతుము
మంగళాంగి మా మనవిని నివుమా!
మహిమాన్విత మా ప్రార్ధన గొనుమా!
అంగజ జననీ!మంగళ కారిణి
మంగళ ములు మా కొసగుము జననీ!

నమస్కారం

on 0 comments Read Full Article

ఇది నా కొత్త బ్లాగ్ లింక్.


http://gudigantalu.blogspot.com/


కొత్త బ్లాగ్ "గుడిగంటలు"
"సురుచి" మొదలు పెట్టి మూడు సంవత్స రాలు కావస్తున్నది.
ఇప్పటిదాకా కలగూర గంపలాగా అన్ని దానిలోనే పోష్ట్ చేస్తూ వచ్చాను.
దేవునికి సంబంధించిన సంగతులు స్తోత్రాలు,పాటలు వేరే పెడితే బాగుంటుందని అనిపించి గుడిగంటలు ప్రారంభించాను.సురుచిలో పెట్టినవి కొన్ని ఇందులో చేర్చాలి.బ్లాగ్ నడపటం ఉత్సాహం కొద్ది గాని
సాంకేతిక మైన తెలివితేటలు వుండి కాదు . కంటికి కనుపించినవి,మనసుకు తోచినవి నలుగురితో పంచుకోవాలని ఆశ .
అన్ని నావికావు. ఇది ఒక కదంబం .నలుగురికి ఇందులో విషయాలు, నచ్చితే ,ఉపయోగపడితే నా కృషి ఫలిం చింది అనుకోటాను.పాఠకులు సురుచి లాగానే దీని ని ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను.

టి.జ్ఞాన ప్రసూన















దేవీ నవరాత్రుల లో పూజలు

on 1 comments Read Full Article

దేవీ నవరాత్రులలో పూజలు
దేవీ నవరాత్రులలో దుర్గా దేవికి లేక లలితకు ప్రతి రోజు సహస్ర నామాలు పూజ చేస్తారు.సాయం సంధ్య వేళలో అమ్మవారి దగ్గర దీపాలు వెలిగించి త్రిశతి పారాయణ చేయడం శ్రేయస్కరము .స్తోత్రాలు,మంగళ హారతులు పాడుకొంటారు.ఈ తొమ్మిది రోజుల లో ఇంటికి వచ్చిన వారికీ పసుపుకుంకుమ లిచ్చి పంపుతారు.
ఈ పండగ రోజుల లో ఒకొక రోజు ఒకొక దేమునికి అశ్టో త్తరము చేస్తారు.
ఈ సంవత్సరము నవరాత్రులు శని వారమునాడు మొదలవుతున్నాయి.
శని వారము -వెంకటేశ్వర స్వామికి
ఆదివారము -సూర్యనారాయణ మూర్తికి
సోమ వారము -శివునికి
మంగళ వారము -ఆంజనేయ స్వామికి
బుధవారము -సరస్వతికి
గురువారము -షిర్డీ సాయి నాధునికి
శుక్ర వారము -శ్రీ మహాలక్ష్మికి
మళ్ళి శనివారము అదే వరస.

అన్నిట నీవెరా!

on 0 comments Read Full Article

  అన్నిట నీవెరా!
రచన -శ్రీ రావూరు వెంకట సత్యనారాయణ రావు


శ్రీ పతి నీవెరా!హృదయ
సీమల నేలేడు నేత వీవేరా!
పాపపు చీకటిన్ వెలుగు
బాటలు దిద్దేడు దివ్వె వీవేరా!
కోపమదేలరా!మనసు
కొద్దిని చేతుల నెత్తుచున్టిరా !
చూపిటు త్రిప్పరా!కరుణ
జూపర నాదొర వెంకటేశ్వరా!


వెన్నెల లేదురా,బ్రతుకు
వేసవి యెన్డర ,ఈ ఎడారి లో
తెన్నులు లేవురా,ఇసుక
తిన్నెలు లేచి తుఫాను వీచెరా,
మన్నును మిన్ను నేకమగు
మార్గమునందొక బాటసారిరా
కన్నుల నివ్వరా వెలుగు
గవ్వవు నీవేర వెంకటేశ్వరా !


దబ్బర లేలరా బ్రతుకు
దండను చేతురా నీకే వెతురా!
అబ్బుర మౌనురా బ్రతుకు
టన్చుల నీ వేలుగింత నిల్పరా!
మబ్బులు లేక నా హృదయ
మండలి నిల్వర చందమామ వై
దిబ్బెన వడ్డికాసునురా
దీవన లీయరా వెంకటేశ్వరా !


అండను చేరి నిల్తువని
ఆశలు చెందితి నేను ,నీవు ఆ
కొండల నెక్కి కుల్కెదవు ,
కొంచెపు వాడను ఎట్లు వత్తురా!
నిండిన వెల్గు వీవనచు
నిల్చితి నిక్కడ ,నాదు పున్నేముల్
పండిన పంటరా!ఎదను
పల్లకి చేతురా వెంకటేశ్వరా !


శ్రీకరమైన పాల్కడలి
శేషుడు మెత్తని పూల పాన్పుగా
నీకయి పవ్వలించు నట
నింగియు బంగారు రంగు ఛత్రమయి
నీకమనీయ రూపమున
నీడలు జిమ్ముచు నుండు నంట, ఆ
లోకన మాఎరా!వెలుగు
లోకము నీవేర వెంకటేశ్వరా!


నీకయి పొంగి పొంగి రమ
ణీయ తరంగము లొక్కటొక్కటే
తాకగ నాగరాజు మెయి
ద్రచ్చిన వెన్నయు ముద్ద ముద్దలై
ప్రాకెడు మంచు కొండవలె
రాజిలు రూపము దాల్చే నేమో ,నా
లోకము నీవెరా !ఎడద
లోతులు తవ్వర వెంకటేశ్వరా!


అసలది క్షీర సాగరము ,
అంబర మంతయు లేత వెన్నెలల్
అసద్రుశ భక్తీ దేవగణ
మంజలి పట్టుచు నీదు మూర్తిపై
విసరేడు వెల్ల నాకధుని
విచ్చినకల్వలు ,ఇంత వెల్లలొ
మసలేడు నీల వర్ణుడవు
మా మది నూగవ వెంకటేశ్వరా!


ఏలర సామి నన్ను గన
వేలరా!నీ కనుదోయి వెన్నెలల్
జాలులు జాలులై ప్రక్రుతి
జాచిన రెక్కల నీలి నీడలో
పూల పడన్తులేల్ల విర
బూసిన అంజలు లందుకొంచు నా
తూలిన గుండెలో వెలుగు
దొంతర పేర్చర వెంకటేశ్వరా !


కమలము నవ్వినన్ మురిసి
కౌగిట చేర్చును చందమామ ప
ద్మము కను గీటినన్ హృదయ
తంత్రులు మీటును భాస్కరుండు ,కూ
రిమి నిను గొల్చు భక్తులకు
రెక్కల నిత్తువు మింట వ్రాలగా
సమరతు లిట్టివే జగతి
సాగును తూగును వెంకటేశ్వరా!


నీలద నీలవర్ణ రమ
ణీయ మనోహర దివ్యరూప !వి
స్ఫార విలోచనా!హృదయ
వేణువు నూదగ తావదేలరా!
సారము లేని జీవితపు
సానువులన్ సుధ లొల్క జేయవా!
కూరిమి రాధనై కొలుచు
కొందుర నేనును వెంకటేశ్వరా!


అణువున మేరువన్దునను
అంబుజ నాభ త్వదీయ రూపమే
తొణికిస లాడు ,విశ్వ మది
తోరపు భక్తితో పుష్ప సంతతిన్
పుణుకుచు తెచ్చి పాదముల
పోయుచు పాడును భక్తీ గీతముల్
వణికెడు నాదు గుండెలవి
యొప్పున పూజకు వెంకటేశ్వరా!


అందిన దోయి లో వెలుగు ,
ఆత్మయే నీవను సత్య మెప్పుడో
అందినదోయి ,నా బ్రతుకు
నంకిత మెప్పుడో ఇచ్చితోయి ,నీ
సుందర రూపమున్ గనగ
చూపుల గుండెల గుచ్చుకొన్దు నే
కొందల మందుచుంటి కను
గోవలె నిన్నిట వెంకటేశ్వరా!


పూవులు చూచినను పుణుక
బోవదు హస్తము,రేకు రేకునన్
శ్రీవర నీదు రూపమది
చిత్రితమై కనుపించు ,కమ్మనౌ
తావుల లోన నీకరుణ
తారట లాడును కొమ్మకొమ్మకున్
పూవుల దేవళమ్ము
లయిపోఎర నీకయి వెంకటేశ్వరా!


శ్రీకరమైన నీ హృదయ
సింధువు నందొక బిందు రూపమై
నీ కమనీయ వేణురవ
నిస్వన మందొక సుస్వరంబునై
నీకయి మంగలారతుల
నేత్తెడు జ్యోతుల వెల్గుదారమై
పోక ఇదేలరా బ్రతుకు
బొంతర చింతర వెంకటేశ్వరా!


ఇడుముల బడ్డ నా బ్రతుకు
నించుక సానను చేసి యుంచితిన్
కదు వెరగొన్దు గుండెల సు
గంధపు చెక్కగా మార్చి యుంచితిన్
వడి వడి రాచి గంధమును
వన్నెల గిన్నెల కెత్తుచున్టి ,నీ
అడుగుల పూసికొందునురా
అందగా నీయరా వెంకటేశ్వరా!


మానవ జన్మ మిచ్చి ఇటు
మాయను త్రోసితి వేలరా ప్రభూ
జ్ఞానము చాలి చాలదుర
సాత్విక భావము నందలేనురా
ధ్యానము నిల్ప జాలనురా
తాపస వృత్తిని బూనలేనురా
మ్రానది మేలురా పువుల
మాలల నిచ్చుర వెంకటేశ్వరా!


జగమను చిత్ర రంగమున
జన్మల చావుల నిచ్చి పుచ్చుకో
తగిన విలాస లాలసల
దాగుడు మూతలు నీకు నచ్చేనా!
సగమయి పోతి నిన్విడిచి
చక్కని కృ ష్ణు ఢ వౌచు రమ్ము నీ
పగడపు కాలి గజ్జెనయి
పాడెద నాడెద వెంకటేశ్వరా!


స్వాగత మిత్తునో అమర
వందిత సుందర రూప నాకపున్
భోగము లేమి లేవిచట ,
పొంగిన మాఎద లొక్క టొక్కటే
దాగిన మూగ వీణలుగా
తత్తర నిత్తుము నీవు మీటినన్
రాగము లేమి జీవిత వి
రాగమే కల్గును వెంకటేశ్వరా!


లోక మనోహరా!ప్రణవ
లోల !శుభాంగ !పతంగ వాహనా !
ప్రాకట వైభవోన్నత వి
రాజిత పూజిత దివ్య తేజ ,అ
స్తోక కళా ప్రసన్న ,నయ
శోభిత ,ఎంతటి ప్రేమ కల్గే ,మా
వాకిటి ద్వారమున్ తెరిచి
వచ్చితి వల్లన వెంకటేశ్వరా!


ఇది యొక మాయ జన్మ జని
యించితి నావిధి యాజ్న రీతిగా
హృదయము వేదనా విధుల
హోరున వీచు తుపాను గాలిలో
పదిలము గాగ పట్టగల
బంగరు చేతి సరంగు నీవు ,నన్
వదలకు రా ప్రభూ!బ్రతుకు
వాకిట నిల్వర వెంకటేశ్వరా!


చెప్పరా స్వామీ!మేమెలమి
చేసేడు పూజలు నీకు నచ్చేనా!
చెప్పరా సామి!మామొరలు
చేరిన నీదగు వీను దోయికిన్
చెప్పరసామి!నాబ్రతుకు
చెంగలి వచ్చేనా పాద మంటగా !
తప్పదు స్వామీ మా కభయ
దానము సేయగా వెంకటేశ్వరా!


మనసున మల్లె పందిరులు
మాటలు తీయని తేనే జల్లులున్
కనుగవ నీకునై మురిసి
కాన్కగా నిచ్చెడు మంగ లారతుల్
తనవున వందనాక్రుతులు ,
ధ్యానమునన్ వెల లేని వెల్గులున్
పెనుగొను రీతి నీ వడుగు
పెట్టావా నాయెద వెంకటేశ్వరా


పొందుగ పూచు పువ్వులను
పున్నమి వెన్నెల లేత నవ్వులో
అందము చిందు డెన్దముల
ఆమనికోయిల తీపిగొంతులో
వందన ముద్రలో ,మధుర
వంశి నినాదములో,నుషస్సులో
సందేలో నీదు భావనలే
సాగును తూగును వెంకటేశ్వరా!


తెల తెల వార నీచరణ
తీర్ధము చేరెడు కౌతుకమ్ముతో
తెలితెలి రేకులన్ వరుస
తీరిచి దిద్దుచు విచ్చి నవ్వుచున్
వెలగల జన్మలై ప్రభుని
వెన్నెల పాదము చేరు పుష్పముల్
ఇల జనియించు నాడే ఫలి
ఇంచుర జన్మము వెంకటేశ్వరా!


రాగము త్రుంచి వేయరా ,వి
రాగము నా ఎద సాగ నీయరా!
భోగము లాపి వేయుమురా,
పొందుగా త్యాగము నాకు గూర్పరా!
తూగగా నీయరా బ్రతుకు
తుందిల మందుచు నీదు సన్నిధిన్
మ్రోగెడు ఘంట సేయుమురా
ముక్తి నోసంగర వెంకటేశ్వరా!


ఎందరు రాజులీజగతి
నేలిరో,ఎందరు బీద గుండియల్
చిందగా జీవితంములను
జిమ్మిరో కాలపు పెన్ ఎడారిలో !
అందరి నన్ని రీతులను
ఆలన చేయుచు సూత్ర ధారివై
యుందువు,నాదు పాత్ర ఎటు
లోప్పెనో చెప్పవా వెంకటేశ్వరా!


ఉల్లము నీకే ఇచ్చితిని
వూరక యుంచుట పాడిగాదురా
పిల్లన గ్రోవి చేసి విని
పిమ్పర మోహన రాగ సంపదల
చెల్లనికంఠ మిచ్చితివి
చెచ్చెర శంఖము చేసి యూదరా!
వల్లెగా తాల్చరాబ్రతుకు,
వైళమ గైకొని వెంకటేశ్వరా!


తడబడు గుండెలన్ బ్రతుకు
దారుల వంటరి గాడనైఎటో
నడుచుచు నుండు నావెనుక
నవ్వుచు నీవును వచ్చుచున్నటుల్
అడుగుల సవ్వడిన్ వినెద
నయ్యది నీవని పొంగి పోఎదన్
ఇదుములు అడ్డురావనుచు
నేగెద ముందుకు వెంకటేశ్వరా!


ఇసుక ఎడారిలో బడుచు
ఇంకెడు సన్నని వాగు రీతిగా
వెసఁ తోలి ప్రొద్దులన్ విరిసి
వెండియు సందెకు రాలు పూవుగా
మిసమిస లాడు యవ్వనము
మీగడ నవ్వులు వెన్నముద్దలున్
విసుగునడుల్లిపోవుగడ
వెంటగా నుండవ వెంకటేశ్వరా!


వేణువు నూదుచున్ హృదయ
వీధుల గ్రుమ్మరి నాడ వేప్పుడో
వీణియ మీటుచున్ హృదయ
వేదిక వాణిగా నిల్చి తెప్పుడో
త్రాణయె లేని నా బ్రతుకు
దారుల లచ్చిగా వచ్చి నిత్య క
ల్యాణము సేసి తొక్క ఎడ
అన్నిట నీవేర వెంకటేశ్వరా!


ప్రాణికి ప్రాణీకిన్ నడుమ
బాంధవ ముద్రలు పూల వంతెనలు
రాణ యొనర్ప జీవిత వి
రాగమే సాగిన దివ్య రాగముల్
వీణియ నందచేయగల
విశ్వ మనోహర దివ్య గాయకా
స్థాణువు నైన నా హృదయ
తంత్రులు మీటవా వెంకటేశ్వరా!


అంతం లేని సాగరపు
టావాలి యంచుల మిన్ను పంచలన్
వింత లవెన్ని యున్నవియో,విశ్వ
మదేంతటి శాంతి దామమో!
సుంత కనుంగోనన్ తలచి
చూపులు వాపిరి చెందు జీవితం
బంతము లేని సాగరము
ఆవల నీవేర వెంకటేశ్వరా!


మిన్నుల వెన్నెలల్ కురియు
మేలిమి మబ్బుల పూల మేడలో
కిన్నెర పాణి వీణియలు
కేల ధరించి గమించి మించుచున్
క్రొన్నన లెల్ల తీవలుగా
గొంతుల నెత్తుక పాట పాడుచున్ ,
నిన్నే భజింతు రంత,ఇక
నేనన నేంతర వెంకటేశ్వరా!
మసృణ మనోజ్ఞా రాగ విమ
లోజ్వల కోమల పాద పద్మమున్
మురిసిన తేనే టీగలుగా
ముక్తిని గాంతురు మౌనులేల్ల ,నీ
ప్రసరిత భావ సంపదల
పాడుచు వచ్చెడి తేటి నౌదు ,నా
కొసగవే రెక్కలన్ మురిసి
కొందుర నీ దరి వెంకటేశ్వరా!


నిద్దుర లోన నామనసు
నీకయి వచ్చును ,ఏదుకొన్డలన్
వొద్దిక తోడ నేక్కును ,న
మో !యని మ్రొక్కును కేక వెట్టి ,నీ
ముద్దుల రూపమున్ గనుచు
మూర్చిలి పోవును ,నన్నే నాముగా
దిద్దుకొనంగా రాదో!మరి
దేనికి మేల్కువ వెంకటేశ్వరా!


ఎన్నడో నమ్మి నానుకద
ఏలిక యుండెను ఏడు కొండలన్
మన్నన సేయు నన్ననచు ,
మట్టితో చేసిన మాయ బొమ్మ కే
మున్నది శక్తి?నీచరణ
ముల్ మది దాచక యున్న భక్తియే
యన్నము,ధ్యానమే వలువ
యంతియే చాలుర వెంకటేశ్వరా!


నీనని చెప్పు కొందు ,మరి
నీనాన నెవ్వరు?నిన్ను నిన్ను గా
నెనెద దాచుకొందు మరి
నీవన నెవ్వరు?నీవు,నేనునున్
దేనికి దూర మైతి మిటు?
తేజము నీవయి వట్టి నీడగా
నీనాయి పోవనేల?నను
నిన్నున జేర్చవ?వెంకటేశ్వరా!


తొగరు గులాబి రేకులవి
తూరుపు దిక్కున గుమ్మరించి తా
సొగసు వేలార్చేరా,యుషసి
సొంప్స్గు నీదగు కుంచె తాకినన్
అగణిత రాగ భావములు
యల్లిక లల్లుక పోవునయ్య !ఈ
పగిలిన బీద గుండెలకు
పట్టవా రంగులు వెంకటేశ్వరా!


నరులకు కావలెను సిరులు
నవ్విన,చూచిన ,పల్కరించినన్
గురుతుగా రూక చూపవలె ,
కోర్కెల గుత్తులు మెల్లమెల్లగా
విరియును లక్ష్మి చెంగ టనె !
వెర్రికి త్రాగుడు నేర్పినట్లుగా
సిరి మురిపించు నీ నరుల
చెప్పరా కొంచెము వెంకటేశ్వరా!


ఎన్నగారాని మోహముల ,
నెన్నిటినో ,వెసఁ సంతరించి ,ఆ
త్మోన్నతి నందు మారగమున
మోసపు త్రోవలు దిద్ది అచ్చమౌ
తెన్నుల దొంగ దీపములు
తేకువగా వెలయించు కొంటిరా!
కన్నుల చీకటిన్ తెగడు
కాటుక దిద్దర వెంకటేశ్వరా!


దివ్య స్వరూప!నీ హృదయ
తీర్ధము నందొక యాత్రికుందనై
భవ్య మనస్కతన్ వెలుగు
బాటల జేరగా గోరినాను ,నీ
నవ్య మనోజ్ఞా రూపమది
నాట్యములాడును నాడు కన్నులన్
కావ్యము నౌదు నేను ,కృతి
కర్తవు నీవేర వెంకటేశ్వరా!


సజ్జన వృత్తియన్ పువుల
చాలగ దూసుక వచ్చి యాత్మనే
సజ్జను చేసి యుంచితిని
సాగిలి వచ్చేడు భాష్ప ధారలన్
మజ్జనమాడ జేసితిని ,
మామక జీవన దివ్య వ్రుత్తికై
పజ్జను జేరి నిల్వు మని
పాదము కప్పితి వెంకటేశ్వరా!


బంగారు వంటి యౌవనము
పైకొని వచ్చు జరా భరమ్ముతొ
రంగులు మాయురా !ప్రణయ
రాజ్యము మెల్లన డుల్లి పోవురా !
పొంగిన గుండెలో విరియ
బూసిన పూవులు వాడి పోవురా!
చెంగట నీవు నిల్తువని
చేతులు జాతుర వెంకటేశ్వరా!


ఇహమన నెంతయో భ్రమసి
ఏ చరియించితి నెల్ల తావులన్
కుహు కుహు నాదముల్ పడుచు
కోయిల గొంతులు విందు నంచు
అహమది తెల్ల మైన యది
అంతయు శూన్యము, దైన్యమంతయున్
ఆహారహమున్ భవత్స్మరణ
కన్కిట మైతిని వెంకటేశ్వరా!


కొండను జేరవచ్చుతిని
గొప్పగా జూచితి నిన్ను, గుండెలో
పండెను భక్తీ భావములు ,
పాపపు చీకటి పారత్రోలుచున్
నిండెను వెల్గు నాఎడద ,
నిన్నట అల్లన పల్కరించితిన్ ,
కొండకు మెట్టు సేయుమని
కోరగా లేదొకో?వెంకటేశ్వరా!


నినుమది నిల్పి వేడుకొను
నిశ్చల చిత్తము సున్టలేక,నే
ననవరతంబు నా బ్రతుకు
నంగడి త్రిప్పుచు ,రూకలన్న చొ
కనులను పెద్ద చేసుకొని
కమ్మని కైతల ధారా పోయగా
చనెద నటంచు ,కోపమున
శాపము చుట్టితే ?వెంకటేశ్వరా!


ఒక నెలవంక తోచి విజ
యోత్సవ కాంతులు సంతరిమ్పగా
ఒక చిరుగాలి వీచి పువు
లోగిట పుప్పొడి జిమ్మి పోవగా
ఒక సెలయేరు పెల్లుబికి
ఒడ్డుల గజ్జెలు సందడిమ్పగా
ఒక కవితానుభూతి యెద
నొక్కులు దిద్దుర వెంకటేశ్వరా!


అంచిత భక్తీ భావముల
ఆత్మ వెలుంగులు దూసిపోయుచున్
వంచిన పూల కొమ్మ వలె
వారధిలా గావలె మానవాళి ,ఆ
పంచల పారు నీకరుణ
వాహిని చల్లగా నెల్లవేళ ,నీ
పెంచిన తోటరాకుసుమ
పీథము లెల్లెడ వెంకటేశ్వరా!


దేహము నిచ్చి నావుగద
తీరని దాస్యము చేయజాలరా!
గేహము నిచ్చి నావుగద ,
కిన్నెర లాస్యము చేయజాలరా!
మోహము కప్పినావుకద,
మోసపు దుప్పటి మొయలేనురా!
వాహన మౌడురా ఎగిరి
వ్రాలర రెక్కల వెంకటేశ్వరా!


విచ్చిన నంది వర్ధనము
వెన్నెలలో తలలూపినట్లు ,భా
వోచ్చాయ వీధులను కవిత
లుయ్యలలూగిన యట్లు ,పల్లెలను
పచ్చని పంట సీమపయి
బంగారు పిచ్చుక లాడినట్లు ,నీ
నెచ్చెలి వచ్చి పోవునురా!
నిలవదు మాదరి వెంకటేశ్వరా!


అరువది వత్సరమ్ము లిటు
లల్లన సాగెను జీవితమ్ములో
సిరిని వరించి తెచ్చి మరి
చేర్చగా లేదురా బందిఖానలో
సరసుడా వంచు నిన్నేరిగి
చక్కగా దాచితి నాడు గుండెలో
మురియుచు పిల్చుకొందునురా
ముద్దుగా బల్కవ వెంకటేశ్వరా!


జీవిత మంతయున్ మురిసి
సేవలు చేసితి నీకు,నిచ్చలున్
పావన మైన నీ స్మరణ
భాగ్యము కల్గెను ,రాతి పూవులో
తావులు గ్రుమ్మరించితివి
దాచక పంచితి నెల్ల వారికిన్
రావలె నీవు దగ్గరకు
రాజిలు శోభలు వెంకటేశ్వరా!



ఏటికో ఎవ్వరిన్ గనిన
ఎప్పటి బంధువులో వరమ్ముగా
నేటికి జూచి నాడనని
నెమ్మది పొంగేద మేలమాడేదన్
చాటెద భక్తీ భావములు
చక్కగా పాడెద ,గుండె వాకిటన్
పీటలు వేసి పిల్చెదను
పెంపోనరించెద వెంకటేశ్వరా !


తెల తెల వార తూర్పుమల
దిద్దిన చల్లని లేత వేల్గులో
కల కల లాడు పుష్పములు
కమ్మని జాబులు తెచ్చి ఇచ్చురా!
పిలిచితి వేమొ నీవనుచు
పిట్టల సందడి నాలకిన్తురా!
ఇల పయి పైడి నిచ్చెనలు
ఈ తోలి ప్రొద్దులు వెంకటేశ్వరా!


గడచిన కాల వాహినుల
కట్టడి కొయ్యల నావ నెట్టులో
నడిపితి విన్నినాళ్ళు మరి
నావకు లోతగు నీరు నీవెరా!
సుడులను తాకకుండా ,యెది
చుట్టక ముట్టక తీర సీమకున్
వడి వడి చేర్పరా చరణ
సన్నిధి చేర్చర వెంకటేశ్వరా!


ఒవరదాయకా!బ్రతుకు
నూర్పిడి సేతువు కర్మ లేడ్లుగా
ప్రోవులు పడ్డ పాపమది
పొందగు కుప్పగా ,నీదు ధ్యానమే
కావలె నిత్తరిన్ పసిడి
కల్లముగా ,నది శూన్య మైనచో
జీవితమంతా తప్పలుర
చేటల చేటురా వెంకటేశ్వరా!


అల్లన తొంగి చూచి హృద
యాంతర మందొక పైడి గూడుగా
నల్లి తనన్తటన్ చిలిపి
నాణెపు వీణియ మీటి పాడి ,ఎ
చెల్లని వాని నైనను వి
జేతగా సేయుచునుండు లక్ష్మి మే
మెల్లను తండ్రి బిడ్డలము
మేలయే నయ్యది వెంకటేశ్వరా !



తలచిన యంతనె బ్రతుకు
దారుల పూవుల మేడ గట్టుచును
కొలచిన యంతనె వెలుగు
కొండగా చెంతకు వచ్చి
నిలచుచున్
పిలిచినా యంతనె మురిసి
పెంచిన తండ్రిగా చేయి జాచుచున్
కలతలు తీర్చు దేవుడవు
కన్నుల దాతురా వెంకటేశ్వరా!



నాటక రంగ మీ జగము ,
నాటక వృత్తము నీదు హేలయే
మాటలు ,పాటలున్ ఎవరి
మార్గము వారిది,ధర్మ మార్గమున్
దాటగా రాదు ,మోహమను
దారిన బోవగ రాదటంచు ఏ
చ్చోతనో దాగి పల్కెదవు
చూడరా నా కధ వెంకటేశ్వరా!


కరువటారా ప్రభూ కరుణ !
కర్మలు త్రెంచుట కొత్త విద్యయా!
బరువటారా ప్రభూ పదము
పట్టిన భక్తుల కాచి బ్రోచుటల్
అరుదటారా ప్రభూ అభయ
హస్తము నల్లన జాచి పిల్చుటల్
పరమ పదమ్ము జేర్పగల
భారము నీదేరా వెంకటేశ్వరా!


పంకజ నాభ నా హృదయ
పద్మము నందలి వెల్గు రేకలే
యుంకువ లౌను నీకనచు
ఉత్సుకతాన్ కోన గోట గిల్లి నీ
కంకిత మిచ్చినాను ,పృధు
కావ్యము కాదిది ,పూల జాబురా
వంకలు పెట్ట బొకుమురా
వంశి మనోహర వెంకటేశ్వరా!


గోవింద యని పిలవ కో యందు వట నీవు
వాస్తల్య రాశివా వరదరాజ
ఏడు కొండల వాడ ఎక్కడ నీవన్న
ఎక్కి రమ్మందువా చక్కనయ్య
వడ్డీ కాసులవాడ వచ్చు చున్నా నన్న
తొంగి చూచెద వెంత దొడ్డ దొరవో
ఆపద మ్రొక్కుల అయ్యవాయన్న
కాపాడే దేంతటి కరుణయయ్య
నిన్ను తలచిన వారికి నిజాము సుమ్ము
కాపురము వీడి పరుగెత్తు పాపమేల్ల
నిన్ను కొలచిన వారికి నిజాము సుమ్ము
భవ భయమ్ములు దూరమై పారిపోవు

నీదు నామంబు మనసున నిలుపుకొందు
నాడు ముప్పులు తప్పించి నడుపుమయ్య
నీదు నామంబు మోమున నిలుపుకొందు
నాడు తప్పులు సైరించి నడుపుమయ్యా !


ఒకరన్నారు -
చ -తిరుపతి వేంకటేశ్వరుని దివ్య గుణంబులు తీర్చి దిద్దగా
సరస పదాళి గుంభనము సన్నుత మైన అలంక్రియోద్ధతిన్
విరసిత పద్మ గంధ సమ విస్తృత హావములోప్పు భావముల్
యరసి రచించి నావుగద హాయిగా వెంకట సత్య ధీ మణీ

నేమాని గోపాల కృష్ణ మూర్తి శాస్త్రి





















దుర్గా సప్త శతి ప్రార్ధన శ్లోకాలు

on 0 comments Read Full Article

దుర్గా సప్త శతి ప్రార్ధన శ్లోకాలు
ఉత్తరాదిన దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు దుర్గా సప్త శతి శ్లోకాలు
పారాయణ చేస్తారు .తొమ్మిది రోజులు అన్నం తినరు.ఉడక బెట్టిన బంగాళా దుంపలు, సగ్గుబియ్యముతో చేసిన వంటలు తిని వుంటారు. దుర్గా సప్త శతిలొ ఈక్రింది శ్లోకాలు మహత్తర మైనవి.ఇవి ఆ తొమ్మిది రోజులు పారాయణ చేస్తే కుటుంబములో అందరికి సుఖము, శాంతి
లభిస్తాయి.
ఓం జ్ఞానినా మాపి చేతాంసి దేవీ భగవతీ హిసా
బలదాక్రుష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి

ఓం దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతో:

స్వస్థ్తై స్మృతా మతి మతీవ శుభాం దదాసి
దారిద్ర్య దు:ఖ భయ హారిణి కా త్వదన్యా
సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా
ఓం సర్వ మంగళ మాన్గల్యే శివే సర్వార్ధ సాధకే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే

ఓం శరణాగత దీనార్త పరుత్రాన పరాయణే
సర్వ స్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే

ఓం సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే
భాయేభ్య స్త్రాహినో దేవి దుర్గేదేవీ నమోస్తుతే

ఓం రోగానసేషా నాప హంసి తుష్టా
రుష్టాతు కామాన్ సకలా నభీష్టాన్
త్వామాశ్రితానాం న విపన్నరాణామ్
త్వామాశ్రి తాహ్య శ్రయతాం ప్రయాతి
ఓం సర్వ బాధా ప్రశమనం త్ర్యై లోక్య స్యాఖి లేస్వరి
ఎవ మేవ త్వయాకార్య మస్మద్వైరి వినాశనం

దేవీనవరాత్రులు -రంగులు

on 0 comments Read Full Article

దేవీ నవరాత్రులు వస్తున్నాయంటే ఇళ్ళల్లో ,దేవాలయాలలో ఒకటే సందడి. తొమ్మిది రోజులు వరుసగా
చేసుకొనే ఈపూజల పండుగకి ముందే కొన్ని ఏర్పాట్లు చేసుకొని ,ఒక పధకము ఏర్పాటు చేసుకొని దాని ప్రకారము నడుచుకొంటే సులువుగా వుంటుంది. దేవీ నవరాత్రులలో అమ్మవారికి అక్షింతలతో పూజచేస్తాము. ఆఅక్షింతలు
మంచి బియ్యం చూసి, గింజ నడుము విరిగినవి ఏరివేసి పూర్తిగా వున్నా బియ్యపు గింజలనే ఉపయోగించాలి.avi నవరాత్రులకి ముందుగానే ఏరుకొని అట్టి పెట్టుకోవాలి.కొన్ని బియ్యము రామనామము స్మరిస్తూ ఏరుకొని వాటితో
నవరాత్రులలో అమ్మవారికి పాయసం చేసి నైవేద్యము పెడితే మంచిది. పమిడి పట్టి తెచ్చుకొని నలకలు లేకుండా
బాగు చేసుకొని అయుదు వరసలు వుండేలా వత్తులు ,బొడ్డు వత్తులు చేసుకొని ఆవునేతిలొ తడిపి ఒక భరిణెలొ
పెట్టుకొంటే తయారుగా వుంటాయి,నేతిలో నాని ఎక్కువ సేపు దీపం వెలుగుతుంది.
నవరాత్రులలో ఏరోజు ఏరంగు వస్త్రాలు కట్టుకొంటే మంచిదో ఒక చోట చదివాను.
అమ్మవారిని కొందరు పెద్ద విగ్రహాలు చేయించి నవరాత్రులలో ప్రతిష్ట చేసి పూజిస్తారు. ఈరంగులచీరలు అమ్మవారికి కూడా ధరింపచేయ్యాలి
పాడ్యమి -చిలక పచ్చ రంగు
విదియ -నారింజ రంగు
తదియ -పసుపు పచ్చ రంగు
చవితి -ఆకాశ నీలం రంగు
పంచమి -గులాబీ రంగు
షష్టి -గచ్చకాయ రంగు
సప్తమి -ఆకు పచ్చ రంగు
అష్టమి -నేరేడు పండు రంగు
నవమి -కృష్ణ నీలం రంగు
దశమి -ఎర్రరంగు
వీ లయితే ఆచరించండి.
,

శ్రీ సత్యనారాయణ వ్రత కథ

on 0 comments Read Full Article

ఎలా మొదలు పెట్టాలి
శ్రీ
సత్యనారాయణ వ్రత కథా గానం
రచన తటవర్తి జ్ఞాన ప్రసూన
శ్రీ సత్యనారాయణ స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు . సత్యనారాయణ వ్రతము ఏకాదశి ,పౌర్ణిమ , మకర సంక్రాంతి మొదలైన రోజులలో
ఎప్పుడయినా చేసుకోవచ్చు .సత్యనారాయణ స్వామి పిలిచితే పలికే దైవం ,భక్తులకి కొంగు బంగారం .
వ్రతం చేయాలంటే బ్రాహ్మణుని పిలిచి బంధువులని
పిలిచి శక్తి కొలది అట్టహాసంగా చేసుకోవచు , ఒకవేళ
ఆలా కుదరక పొతే కుటుంబ సభ్యులు మాత్రం కలసి
చేతనయినంతలో శ్రద్ధగా , భక్తితో చేసుకొనవచ్చు .ఈపూజకి ఏమేమి కా వాలో ముందు
వివరించటం జరిగింది . కథని అయుదు అధ్యాయాలలో చెప్పడం జరిగింది .ఒకోక అధ్యాం ముగియగానే
అరటిపండు నైవేద్యం పెట్టి , కర్పూర హారతి ఇచ్చి
రెండవ అధ్యాయం మొదలు పెట్టాలి . చివరికి రవ్వతో చేసిన ప్రసాదం నివేదన చేయాలి .శ్రద్ధా ,భక్తీ
మనసులో నిండి వుంటే మనం ఏమి పెట్టినా , ఎంత పెట్టినా
స్వామి సీకరిస్తారు .
గోవింద నామాల వరసలో దీనిని పాడుకోవచ్చు .
పుస్తకం ఇప్పటికి మూడు ముద్రణలు అయ్యాయి .విదేశాలలో వున్నా ప్రవాసాంధ్రులకి ఇది ఉపయోగ పడుతుందని
భావిస్తున్నాను .
శ్రీసత్యనారాయణ వ్రత కథా గానం

ప్రతి వరుసలో చివర రమానాథా ,అని చదవాలి .
ఇల్లలికి ముగ్గులుపెట్టి రమానాధా
మామిడి చిగురుల తోరణాల్ కట్టి "
పీట కడిగి పసుపు రాసి "
బియ్యపు పిండితో పద్మం వేసి ''
కుంకుమ తో చుక్కలు పెట్టి ''
కొత్త తుండు దాని పైన వేసి ''
బియ్యం పోసి '
తమల పాకును సవరించి పెట్టి ''
మర చెంబుకు పసుపు రాసి ''
నాల్గు వైపులా కుంకుమ బొట్లు పెట్టి ''
పసుపురాసిన కొత్త నూలు "
మరచెంబుకు చుట్టివేసి '
కలశం లో నాణెం వేసి "
మామిడి కొమ్మలు దానిలో
కొబ్బరికాయను ఒకటి తెచ్చి '
పసుపు రాసి బొట్టు పెట్టి "
క్యలశము లో మధ్యన పెట్టి ''
కొత్తరేవిక మడిచి కిరీటంలా పెట్టి ''
విఘ్నేశ్వరుని తెచ్చి ""
ముందు తమల పాకుపై నుంచి "
అష్ట దిక్పాలకులను "
ఆహ్వానించి పూజించ వలె "
నవ గ్రహములన్ కూడా ''
రప్పించి పెట్టవలె "
సూర్యునకు , చంద్రునకు "
కర్పూర తాంబూల మిచ్చి "
మొదట గణపతి పూజచేసి ''
అవసర నైవేద్య మిచ్చి ''
పాలు ,పెరుగు . నెయ్యి ''
తేనే , అరటి పండ్లు , కొబ్బరి నీళ్లు ''
పంచామ్రుతము చేసి '
స్నా నాలు చేయించి ''
గంగాజలము తోడ స్నానాలు చేయించి ''
తిన్నగా తిలకము దిద్ది ''
వస్త్రము ,యజ్నోపవీతము ఇచ్చి '
హరిద్ర ,కుంకుమ అక్షతలతో '
అందముగా పూజించి '
గంధమలది , ఆభరణాక్శతలు ''
గర్వముగా నర్పించి ''
పరిమళ పుష్ప ములతో ''
సర్వాంగ పూజ చేసి ''
గంధాలు ,పన్నీరు '
కడుముదముతో నిచ్చి ''
సహస్ర నామములు చదివి ''
అక్షతలు ,పుష్పాల పూజచేసి ''
నేతితో వేపినా గోదుమా రవ్వతో ''
పంచదార కలిపి జీడిపప్పు వేసి ''
ఎండు ద్రాక్షలు వేసి ,ఏలకుల్ పొడివేసి ''
ఒలిచిన అరటి పండు పెట్టి ''
ప్రియమైన ప్రసాదమర్పించి ''
కొబ్బరికాయను కొట్టి ''
వివిధ పండ్లతో నైవేద్య మిచ్చి ''
మాపాపము లంతము చేయమని ''
ధూప ,దీపము లందించి ''
షడ్రసోపెతమైన మహానివేదన చేసి ''
మంత్ర పుష్పము చదివి ''
మంగళ హారతి ముదముతోనిచ్చ్చి ''
ఆత్మ ప్రదక్షిణ నమస్కారము చేసి ''
నీవే నా దైవమని ''
అక్షతలు చేత నుంచుకొని ''
శ్రద్దగా నీకద వినవలె ''

ఇప్పుడు వ్రత కథ మొదలు

శ్రీ సత్యనారాయణ వ్రత కథ - 1

on 0 comments Read Full Article



కథా ప్రారంభం ప్రధమాధ్యాయం..

ఒకసారి మహామునులందరూ రమానాదా
నైమిశారణ్యమున కూడిరి ''
సూత మహా మునుని చూసి ''
ఇట్లు ప్రశ్నించినారయ్య ''
సకలకష్టములు తొలుగా ''

ఈప్సితార్ధములు కలుగగ ''
వ్రతమేదయినా వుండేనా ''
తపస్సేదయినా తెలుప వయ్య ''
అని మునులు సూత మహా మునినికోరిరి ''
అందుకు సూత మహాముని ''
ఇట్లు వారికి చెప్ప దొడగె ''
పూర్వము ఒకనాడు నారదుడు ''
శ్రీమన్నారాయణుని ప్రశ్నించెను ''
నారదునితో నారాయణుడు ''
చెప్పినదే మీకు చెప్పు చుంటి ''
శ్రద్ధతో ఆలకిమ్పు డనెను ''
ఒకసారి నారద ముని ''
సకలలోకములు తిరుగ జోచ్చే ''
దారిలో భూలోకానికి వచ్చి ''
అచట మానవుల కష్టములు చూసి ''
నారదుడు మిగుల చింతించి ''
వీరి బాధలన్ని పోగొట్టాలి ''
అని అనుకొంటూ నారదుడు ''
విష్ణు లోకమునకు చేరినాడు ''
విష్ణు లోకమున నారదుడుదర్శించి నాడు ''
చతుర్భుజుని ''
తెల్లని శరీర చ్చాయగల విష్ణుని ''
నారదుండు చూచి నాడయ్య ''
మనసారా విష్ణుని చూసి ''
ఇట్లు స్తుతింప సాగేనయ్య ''
ఊహించ లీని రూపమయ్య ''
మాటల కందని మన్మధ మూర్తివి ''
అమిత శక్తి సంపన్నుడవు ''
ఆదిమధ్యాంత రహితుడవు ''
నిర్గునుండవు , నిశ్చలుండవు ''
సర్వ గుణాత్ముడ వయ్య '
ప్రపంచానికి ఆదిమూర్తివి ''
అందమైన ఈసృష్టికి కర్తవు ''
భక్తుల కష్టాల బాపీడి వాడవు ''
నీకు భక్తితో నమస్కరిస్తూ ''
అని నారదుడు స్తోత్రము చేసే ''
సంతసించి నారాయణుడు ''
ఇట్లు చెప్ప దొడగె నారదునికి ''
మునిపుంగవా నారదమునీ ''
నీవు ఇటకు వచ్చిన కారణ మేమి ''
నీమనసులోని కోరిక చెప్పు ''
నీకోరికను నెరవేర్చెదను ''
నారద ముని శ్రీ మహా విష్ణువుతో ''
ఇట్లనే జగత్కర్తా వినవయ్యా ''
భూలోకమున మానవులు ''
నానా యోనులందు పుట్టు చుండిరి ''
నానా బాధలు , కష్టాలు పొందు చుండిరి ''
ఏదైనా ఉపాయం చెప్పు ''
వారికి విముక్తిని కలిగించు ''
సుఖముగా నుండుటకు ''
వారిని రక్షించి దీవించ వయ్య ''
అని నారదుడు నారాయణుని ప్రార్ధించే ''
అందులకు భగవంతుడు ''
ఇట్లు చెప్ప దొడగినాడు ''
ప్రజల మంచి కోరి నీవు ''
ఇట్లు నన్ను అడుగు చున్నావు ''
స్వర్గ మర్త్య లోకములలో ''
దుర్లభ మైన ఒక వ్రతము కలదు ''
దానిని చెప్పు చున్నాను విను ''
అది సత్య నారాయణ వ్రతము ''
భక్తీ , శ్రద్ధలతో దీనిని ''
ఆచరించు వారికి సకల సుఖములు ''
వెంటనే ప్రాప్తించు ''
చివరికి మోక్షము నిక్కమయ్య ''
ఆదివిని నారదుడు ''
ఇట్లు విష్ణువు నడిగినాడు ''
దామోదరా ఆవ్రతము ''
చేసినందువలన ఫలమిన్కెమి ''
అది ఎట్లు చేయ వలయు నయ్యా ''
దీనినిపూర్వ మెవరు చేసినారు ''
దీని నెప్పుడు చేయవలయు నయ్య ''
సవిస్తరముగా తెలుపవయ్య ''
సత్యనారాయణ వ్రతము ''

సకల దుఖ్ఖములు తొలగించు ''
సకల సంపద లభి వృద్ది చేయు ''
సౌభాగ్య వృద్ధి చేయు '
సంతానము ప్రసాదించు ''
సర్వకాల సర్వావస్తాలలో ''
ఈవ్రతము చీసిన జయము నిక్కము ''
వైశాఖ మాసమున గాని ''
కార్తీక మాసమునగాని ''
శుభ దినమున గాని ''
శుభ తిథి యందు గాని ''
యుద్ధమునకు పోవునపుడు ''
ఆపదలు మీదపడిన ''
దరిద్రము మింగ పోయిన ''
ఈవ్రతము చేయ వలయు నయ్య ''
ఆ కష్టములు నాశన మగును ''
ప్రతి మాసం చేయ వచ్చు ''
లేక సంవ్స్తారమున కొకసారి ''
ఎవరి కెంత శక్తి వుంటే ''
అంతశక్తి తోనే చేయవలయు ''
సత్యనారాయణ వ్రతము ''
పూర్ణిమ దినమున చేయ వచ్చు ''
ఏకాదశి నాడైనా చేయ వచ్చు ''
రవి సంక్రమణ దినమందు ''
మిగుల భక్తీ తోడ చీయవలయు ''
వ్రతము చేయువారు ఉదయం నిద్ర లేచి ''
కాలక్రుత్యములను తీర్చుకొని ,శుచియై ''
సత్యనారాయణ స్వామిని తలచుకొని ఇట్లు ''
నీఅనుగ్రహమును పొందకోరి ''
భక్తీ శ్రద్ధలతో వ్రతము చేయ వలయు ''
ధ్యానం చేసి నమస్క రించ వలయు ''
మధ్యాన్నం సమయమున ''
మధ్యాన్న క్రియలు నేరవెర్చుకొని''
సాయంత్రం స్నానం చేసి ''
రాత్రి ప్రారంభ కాలమున ''
ఈవ్రతమును చేయ వలయు ''
పూజాగ్రుహము గోమయముతో అలికి ''
అయిదు రంగుల చూర్ణ ముతో ముగ్గు పెట్టి ''
కొత్త వస్త్రమును పరచి ''
దానిమీద యథాశక్తి బియ్యం పోసి''
బంగారమో ,వెన్దో ,రాగో ''
ఇత్తదిదో ,మట్టిదో ,కలసముచేయించి ''
లోభాత్వము చూపకుండా ''
తన శక్తికి తగ్గ కలశమ్ చేయించి ''
రెవిక బట్ట కిరీటం లాపెట్టి ''
సత్యనారాయణ ప్రతిమను ''
భక్తీ తోనూ ఉంచ వలయు ''
ఒకకర్షం బంగారం కాని ''
అర్ధ కర్షము , లేక పావు కర్షము కాని ''
బంగారంతో ప్రతిమ చేయించి ''
పంచామ్రుతములతో అభిషేకించి ''
మంద పమున ఉంచ వలయు ''
మొదట గణపతిని పూజించ వలయు ''
లక్ష్మి దేవిని , విష్ణు మూర్తిని ''
శివుని , బాలా త్రిపుర సుందరిని ''
సూర్యుని , నవగ్రహాలను ''
ఇంద్రాది అష్ట దిక్పాలకులను ''
అధి దేవత ప్రత్యది దీవతలను ''
మనసారా ఆహ్వానించి పూజించ వలయు ''
విఘ్నేశ్వరుడు మొదలగు వారిని ''
అయిదుగురు దీవతలను ''
కలశమునకు ఉత్తర దిగ్భాగమున ''
మంత్రముతో , ఉదకముతో ''
ప్రతిష్టించి పూజించవలయు ''
దిక్పాలకులనుకూడా ''
ప్రాగాది దిక్కులందు ప్రతిష్టించి ''
వారిని పూజించ వలయు ''
పిదప సత్యనారాయణ మూర్తిని ''

కలశం మీదపూజించ వలయు ''

నాలుగు వర్గములో పురుషులైన స్త్రీలైన ''
ఈవ్రతము చేయ వచ్చును ''
భ్రాహ్మనులు శాస్త్రొస్తకముగా
పూజచేయ వలయును ''
సకలమంత్ర తంత్ర యుక్తముగా ''
పౌరాణికముగా వైదీకముగా ''
బ్రాహ్మణులు పూజించ వలయు ''
భ్రాహ్మనేతరులు ''

పౌరాణికముగా వలయు ''
ఏరోజు నైనా సాయంత్ర మందు ''
జనులు భక్తీ శ్రద్ధలతో ''
శ్రీసత్యనారాయణ వ్రతము చేయ వలయు ''
వ్రతము చేయునప్పుడు ''
బంధువుల భ్రాహ్మణుల పిలువవలె ''
ఆవునీయి ,ఆవుపాలు , అరటి పండ్లు ''
గోధుమనూక ,చక్కర , బెల్లంతెచ్చి ''
ఒక్కొక్కటి సేరుం పావు ''
బియ్యపు నూకైనాసరే ''
స్వామికినైవేద్యం పెట్టవలయు ''
స్వామికి నైవేద్యం పెట్టిన పిదప ''
భ్రాణులకు యథాశక్తి దక్షిణ నివ్వాలి ''
ఆపైన కథ విని అక్షతలు సిరసున దాల్చాలి ''
బ్రాహ్మణుల తో , బంధువులతో ''
కలసి ఆనందంగా విందు చేయాలి ''
శ్రీసత్య నారాయణస్వామికి ''
నృత్య గీతములు వినిపిమ్పవలె ''
భూలోకమున కలి యుగ మందు ''
ఈప్సితార్ధములు పొందుటకు ''
ఇది సులభ మైన చక్కటి మార్గము ''
ప్రధమాధ్యాయము సంపూర్ణం



శ్రీ సత్యనారాయణ వ్రత కథా గానము - 2

on 0 comments Read Full Article



ద్వితీయాధ్యాయము


మునులారా ముదముతో వినుడు రమానాథ
ఈవ్రతంచేసిన వారికథ ఇంపుగా ''
కాశినగరమున ఒక బ్రాహ్మణుడు ''
అతడతి రిద్రుడయ్యా ''
ఆకలి బాధతో అలమటించు చుండే ''
దీశామంతా తిరుగు చుండే ''
బ్రాహ్మణుని దశకనెను శ్రీహరి ''
ఒక వృద్ధ బ్రాహ్మణ వేషమువేసి ''
ఆతనిని కలుసుకొనెను ''
వేదవిదుడ వాయి బ్రాహ్మణుడా ''
ఇట్లు కష్టములు పడుట ఏమి ''
అప్పుడా బ్రాహ్మణుడు నమస్కరించి ''
ప్రభూ !నీను మిక్కిలి దరిద్రుడను ''
బిక్షాటన చేసుకోనుచు ''
నేను గడప గడప తిరుగు చుంటి ''
ఎంత కష్ట పడినాను ''
పొట్ట గడవడమే దుర్లభ మయ్య ''
అందుకేమైనా ఉపాయం చెప్పు ''
అని అడిగిన వెంటనే ముసలి బ్రాహ్మణుడు ''
అయితె విను చెప్పుచున్నా ననే
ఇలలో సత్యనారాయణ మూర్తి
కోరిన కోరికలు తీర్చు వాద్య ''
సత్యనారాయనమూర్తి వ్రతం
నువ్వు ఆచరించ వలెనయ్య ''
నీసర్వ దుఃఖములు తొలగి ''
నీవు సంపదలు పొందుదువయ్య
వ్రతము నీవు చేయవయ్యా ''
ఆవ్రతం చేయు విధానం తెలిపి
ఆముసలి బ్రాహ్మణుడు అదృష్యుదయ్యే ''
అప్పుడు ఆబీద బ్రాహ్మణుడు ''
రేపెఆవ్రతం చేతునని పలికే ''
ఉత్సాహంతో రాత్రి నిద్రలేక ''
ఎప్పుడు తెల్లవారునాయని చూచే ''
ఉదయమవగానే లేచి బ్రాహ్మణుడు ''
కాలక్రుత్యములు నిర్వర్తించి ''
నేడు తప్పక వ్రతం చేయాలి అని ''
నిశ్చయంతో వెడలె బిక్షకు ''
ఆరోజు ఆశ్చర్యముగా ''
అతనికిఎంతో ద్రవ్యము లభియించే ''
ఆధనముతో ఇంటికి వచ్చి ''
బంధువులను ,బ్రాహ్మణులను పిలిచి ''
యథావిధిగా వ్రాత మాచరించే ''
సత్యమూర్తి ప్రభావమున ''
అతని దరిద్ర మంతా తొలగిపోయే ''
అదిమొదలు ఆబ్రాహ్మణుడు ''
రోజూ శ్రద్ధతో వ్రతం చేయసాగే ''
ప్రతి దినం వ్రతం చేసి ' అతడు అపార సంపత్తి పొందే ''
పాప విముక్తుడై మోక్షమును పొందే ''
ఈవ్రతము నెవరు భక్తీ తోడ ''
విముక్తి పొందుదురు ''
శ్రీహరి నారద మునికి చెప్పిన సంగతి ''
మీకు చెప్పితిని అని పలికే సూతముని ''
బ్రాహ్మణుని వలనవిని సూతముని ''
ఇంకాఎవరీ వ్రతము చేసినారో ''
దయతో మాకు వివరిమ్పుమని కోరిరి మునులు ''
ఒకసారి ఆబ్రాహ్మణుడు ''
శక్తి కొలది వ్రతము చేసే ''
బంధువులు మిత్రులు ఎందరో వచ్చిరి ''
పుల్లలమ్ము వాడు వచ్చి నిలిచి ''
పుల్లల మోపు బయట వుంచి లోనికోచ్చి ''
సత్యనారాయణ వ్రతం చూసే ''
ఎన్ని కట్టే లమ్ముకొన్న ''
నా ఆకలి దప్పులు తీరుట లేదు ''
ఈపూజ చేసు కొంటే ధనం లభించు నేమో ''
బ్రాహ్మణునిట్లు ప్రశ్నించెను ''
మీరు చేయు చున్న వ్రతమేమి ''
అది చేసిన ఏమి ఫలము కలుగు ''
వివరముగా తెలుపుడని ప్రార్ధించే ''
కలియుగంలో శ్రీహరి అవతారం సత్యమూర్తి ''
అతని వ్రతం చేస్తే ఎంతో పుణ్యం ''
ఇది సకల కష్టములు హరియించు ''
సకల కామితార్ధము లిచ్చు ''
సకల భోగ భాగ్యాలిచ్చు ''
కట్టేలమ్ము వాడదివిని ''
ప్రసాదం తిని ''
సుష్టుగా భోంచేసి ఇంటికే వెళ్లి ''
నేనును సత్యమూర్తి వ్రతం చేతునని ''
ఉత్సాహం పొంగాగాను ''
పుల్లల మోపు నెత్తిన పెట్టుకు ''
ఇట్లు తలపోసే మనసులోన ''
ఈపుల్లలు అమ్మగా ధనమెంతోస్తే ''
అంత పెట్టి వ్రతము చేతు నని ''
అనుకొని నగరమున పుల్లలమ్మబోయే ''
మంచిధనవంతులున్న వీధికిపోయి ''
పుల్లలన్ని 'అమ్మేనాతడు '
ఎప్పుడు రానంత ధనమోచ్చే నతనికి ''
అరటిపళ్ళు ,నేయి ,పాలు ,సక్కేర ,గోధుమ నూక ''
సేరుమ్పావు చొప్పున కొని ఇంటికి వెళ్లి ''
ఇల్లు వాకిలి శుభ్రం చీసి ''
బంధు మిత్రులని పిలిచి ''
బహు శ్రద్ధ తోడ
సత్యనారాయణ వ్రతం చేసి నాడు ''
వ్రత ప్రభావము వలన కొద్ది రోజులలో ''
ఎంతొ ధన వంతుడయ్యే '
పుత్రుడు కలిగే పుత్రికలు కలిగే ''
బ్రతికి నంత కాలమ్ సుఖముగా నుండే ''
అన్త్యమున స్వర్గమును పొందే ' '
ద్వితీయ అధ్యాయము సమాప్తము

ఇంకొక కథ చెపుతాను విను రమానాథా
పూర్వం ఉల్కాముఖు డనే రాజుకలడు ''
నిత్య సత్య vratu
ఇంద్రియములను జయించిన వాడు ''
ఎరోజూ దేవాలయమునకు పోవుట మరువడు ''
దానములిచ్చుట తృప్తి అతనికి ''
రాజు భార్య అతి సౌందర్య వతి ''
మంచి గుణము కలది ఉత్తము రాలు ''
భద్రశిలా నది కలదచట ''
ఆతీరమున కూర్చుని ''
సత్యమూర్తి వ్రతం సలిపిరి వారు ''
ఉల్కాముఖుడు భార్యా కలసి ''
వైభవంగా పూజ చేసినారు ''
డొకడు ''
వర్తకమునకు పోవుచుండె ''
పడవ నిండా ధనముండే ''
దారిలో ఆగి వ్రతము చూడ వచ్చే ''
ఏమివ్రతము చేయు చుంటివి మహారాజా ''
వ్రత విధాన మేమి వివరం చెప్పు ''
వినవలె నని కోరిక గలిగె ''
చెప్పి పుణ్యం కట్టుకోవయ్య ''
పుత్ర సంతానంకోరకు ''
మేము ఈవ్రతము చేయు చున్నాము ''
వ్రత విధాన మిదియని ''
సవిస్తరముగా చెప్పే నతడు ''
నాకును సంతానం లీడు మహారాజా ''
నీను ఈవ్రతం చీసి సంతతిని పొండుడును ''
అని వర్తకమునకై వెడలె నతడు ''
పడవ లోని సరుకంతా అమ్మే ''
తన నగరం చేరి ఇంటికి వెళ్లి ''
భార్య లీలావతికి ఈవ్రతం సంగతీ వివరించి ''
మనకు సంతానం కలిగిందంటే లలనా
మనము తప్పక సత్యనారాయణ వ్రతం చేద్దాం ''
భర్తా చేసిన ప్రటిజ్న విని లీలావతి ''
మనసు ఆనందంతో మునకలు వేసే ''
కొద్ది దినములకు సత్యమూర్తి దయ వలన ''
లీలావతి గర్భవతి యయ్యె ''
నవమాసముములు మోసి మురిసి పోయి ''
పదియవ మాసమున కుమార్తెను గానే ''
కళావతి యని నామకరణం చేసిరి''
అర చేతులలో పెంచిరి పిల్లను ''
శుక్ల పక్ష చంద్రుని వలెను ''
లలన దిన దిన ప్రవర్ధ మాన మయ్యె ''
ఒకనాడు లీలావతి భర్తతో ''
మనకు సంతానం కలిగిందంటే ''
సత్యనారాయనవ్రతం చేస్తానంటిరి ''
సత్యమూర్తి అనుగ్రహంతో ''
ఆడపిల్ల నట్టింట తిరుగు చుండే ''
చేసిన ప్రతిజ్ణ మరచి పోవుట ''


అన్నిటి కంటే మహాపాపం ''
ఇప్పటి వరకు వ్రతము మనము ''
చేయకుండుటకు కారణమేమి ''
భార్య మాట విని భర్త చిరు నవ్వుతో
తొందర ఎమోచ్చిందోయే వ్రతానికి ''
అమ్మాయి పెళ్లి అప్పుడు తప్పక చేద్దాం ''
అనిచెప్పి వర్తకమునకు పోయే
కలావతికి యుక్త వయస్సు వచ్చి నంతనే ''
వివాహం చేయాలని నిశ్చయించి వర్తకుడు ''
యోగ్యమైన వరుని చూడ దూతల నమ్పే ''
కాంచన నగరము లోన ఒక వైశ్య కుమారుని ''
అంద చందాల్ గుణ గణా లెంచి అతన్ని ''
నిశ్చయించి వెంట తీసుకొని వచ్చే నతను ''
పెండ్లి కొడుకును చూసి సాధువు సంతసించి ''
తనకుమార్తే నిచ్చి వైభవంగా పెళ్లి చేసి ''
అతి సంతోషమున మునిగి
వైశ్యుడు వ్రతము సంగతే మరచే ''
అతని మరపు చూసి సత్యమూర్తి దీవుడు ''
అతి క్రుద్దు డు అయినాడయ్య ''
కొంత కాలము గడిచిన వెనుక ''
ల్లునితో చంద్ర కేతు మహానగరమునకు ''
వ్యాపారంకోసం వెళ్ళే నతడు ''
వ్రతము చేసెదనని మ్రొక్కి ''
ఇంట కాలకుచేయకున్డుతచే '
సత్యనారాయణ స్వామికి కోపం వచ్చెఇ '
ఇతనికి దారుణమైన ఖటిన మైన d;ఉఖంకలిగి ''
అని వైస్యుని సపించే సత్యనారాయణ స్వామి ''
అప్పుడే కొందరు దొంగలు ''
రాజుగారి ధనాగారములోన ''
ధనము నపః రించి నారు ''
వారు సాదువున్న చోటికి వచ్చిరి ''
దొంగతనం కనిపెట్టి రాజ భటులు ''
దొంగల వెంట పరుగేట్టిరి ''
తమ వెనుక రాజభాతుల చూసి ''
దొంగలు భయ భ్రాన్తులినారు ''
ధనము తమ వద్ద వుంటే ''
చావుతప్పదని వారు ''
ఆధానము వర్తకుల వద్ద పెట్టి పారిపోయిరి ''
రాజ భటులు వచ్చి వెతికి ''
ధనము వైశ్యుల వద్ద నుండుట చూసి ''
వీరే ''
మామా ,అల్లుల్లని తాళ్ళతో బంధించిరి '' చతుర్దాధ్యాయము

మంచి రోజులు వచ్చే నని మామ ఆల్లుళ్ళు రమా నాథా
తీర్థ యాత్ర లెన్నో త్రోవలో చేసారు ''
బ్రాహ్మణులకు , బీదాబిక్కికి ''
దానధర్మాలెన్నో చేసారు ''
తమనగరమునకు ప్రయాణ మైరి ''
సముద్ర తీరాన వెళ్ళు చుండిరి ''
ఇది చూసి సత్య నారాయణ స్వామి ''
వీరిని పరీక్షించ నిశ్చయించీ ''
కలావతి ,లీలావతి ఎట్టకేలకు ''
నామహిమ తెలిసి నావ్రతము చేసిరి''
వైశ్యునకు ఇప్పటికైనా ''
నావ్రతం సంగతీ గుర్తు రాదా ? ''
సత్యమూర్తి సన్యాసి వేషమున ''
వారివద్దకు వచ్చి ఇట్లనెను ''
వర్తకులారా ! పడవ యందు ఏమి వున్నవి ? ''
వర్తకులు విజయ గర్వముతో ''
మదొన్మత్తులైఒడలెరుగా కుండిరి ''
మా పడవలో ఎమున్నా నేమి సన్యాసీ ! ''
నీ కెందు కయ్యావాటి సంగతీ సన్యాసీ !
నీవు దొంగతనము చేయ వచ్చి తి వి ఒసన్యాసీ ! ''
ఈపడవలో ఏమీ ధనములేదు సన్యాసీ ! ''
వట్టి ఆకులు అలములు తప్ప ఒసన్యాసీ ! ''
అనిన విని సత్యదేవుడు చిరు నవ్వుతో ''
"ఆకులు అలములే వుంటాయి లే " అని వెడలె ''
అల్లంతదూరం పోయి నిలచే ''
మామా ,అల్లుడు పడవ దిగి ''
కాలక్రుత్యాల్ తీర్చుకొని వచ్చినారు ''
పడవ దగ్గర పోగానే ''
అది కాగితం పడవలా తెలు చుండే
పడవలోకి వెళ్లి చూడ ''
ధనమునకు బదులు ఆకులు వుండే ''
వైశ్యుడు చూసి మూర్ఛ పోయే ''
తెలివి వచ్చి విల పింప సాగే ''
అప్పుడు అల్లుడు మామను చూసి ఇట్లనే ''
సన్యాసి శపించెను కదా !అందువలన ''
ఇట్లు ధనము ఆకులలములయ్యే ''
అతని వెదికి ప్రార్ధింతుము ''
అతడే తిరిగీ మన ధనము మన కియ్యగలడు ''
అల్లుడుమాట నిజమని ''
సన్యాసి వద్దకు పోయిరిరువురు ''
మహాత్మా అనినమస్కరించి ''
మీము అవివేకము తో ప్రేలినాము ''
మా అప రాధము క్షమిమ్పవయ్య ''
అని అన్ని విధముల ప్రార్ధించిరి ''
ఇప్పటికైనా బుద్ది వచ్చేనా ! వెర్రివాడా ! ''
నీవు సత్యనారాయణ వ్రతం చేస్తానని ''
మాట తప్పి మరచినావు ''
దానివలననీ దారుణ దు :ఖం ''
వైశ్యుడు చేతులు జోడించి ''
ఈలోక మంత నీ మాయచే నిండెను ''
బ్రహ్మాది దీవతలు గుర్తింపలేరు ''
అజ్నానుడను ,మూర్ఖుడను ''
మూఢుడను , జడమతిని ''
నిన్ను అనేక విధముల ప్రార్దింతును ''
నాపై కరుణ జూపి రక్షించు ''
నా ధనము నాకు అంద చేసి ''
నాకుటుంబమును కాపాడ వయ్యా ''
అతని విన్నపాలు వినిస్వామికి దయ కలిగి ''
తిరి గి ధనమునంత ఇచ్చేసి అద్రుశ్యు డయ్యె ''
మామా ,అల్లుడు పడవ ఎక్కి చూడగానే ''
ఆకులుపొయి రూకలు వచ్చే పడవలో ''
స్వామికి కృతజ్ఞతా తెలిపి ''
కడు ముదముతో ఇరువురు వెడలిరి ''
స్వనగరము దాపుకు రాగానే ''
అదేనోయి , మనవుఉరు వచ్చివేసాం ''
అని అల్లునికి మామ చూపించాడు ''
సేవకునిపిలచిభార్యకు , బిడ్డకు ''
తమరాక తెలిపి రమ్మనేను ''
సేవకుడు వర్తకుని ఇంటికి వెళ్లి ''
కళావతికి , లీలావతికి ''
వారిపతులరాక నేరిగించి ''
త్వరలో వస్తున్నారనే ''
లీలావతి ఈమాటలువిని ''
ఆనందం పట్టలేకపోయే ''
మన వాళ్లు వచ్చేసారటే అమ్మాయీ ''
వ్రతం త్వరగాముగించి రావే పోదాం ''
పూజ పూర్తి చేసినారు వారిరువురు ''
తొందరలో ప్రసాదం తినలేదు ''
అందువలన సత్య మూర్తికి కోపం వచ్చి ''
ధనముతో సహా పడవను నీట ముంచే ''
పడవతోపాటు అల్లుడు కూడా మునిగి పోయే ''
లీలావతి నెట్టి బాదుకు ఏడవ సాగే ''
అల్లుడా ! కళ్ళెదుట నీట మునిగితివా ''
ఇది అంతా స్వామి మాయ నిశ్చయముగా ''
అని కుమార్తెను కౌగాలించుకు విల పించే ''
భర్త మృతి చెందేననివిని కళావతి ''
అతని పాదుకలతో సహగమనము ''
చేయుదు నని నిశ్చయించీ ''
స్వామికి కోపం వచ్చెనని షావుకారు ''
చీత ఇట్లయ్యేనని ''
నా శక్తి కొలది వ్రతము చేతు ''
భక్తీ శ్రద్ధలతో ప్రార్ధింతు ''
స్వామిని తలచి సాష్టాంగ పడి ''
అనీక విధముల స్తుతియించే ''
అప్పుడు సత్యదేవుడు సంతోషించి , ఇట్లనెను ''
భర్త వచ్చినాడను ఆనందముతోను ''
నీకుమార్తే నా వర ప్రసాదము ''
తినకుండా పడవ దగ్గర కొచ్చే ''
అందువలన భర్త ఆమెకు ''
కనిపించకుండా మునిగిపోయే ''
ఇంటికి పోయి ప్రార్ధించి ''
ప్రసాదంతిని వచ్చిన వెంటనే ''
అల్లుడు జీవించి వచ్చు ''
అంతయు శుభ కర మగును ''
ఆకాశ వాని వినిన తోడనే కలావతి ''
పరుగుపరుగున ఇంటికి పోయి ''
ప్రసాదమును స్వీకరించి ''
తిరిగీ పడవ వద్దకు వచ్చే ''
వచ్చి చూచు సరికే అచట ''
పడవనీటిపై తీలి యుండె ''
ఆమె భర్తా కూడా కను పించే ''
అది చూచి అందరు ఆనందిన్చిరి ''
తండ్రీ !ఆలస్య మింకీల మనకు ''
భక్తీ శ్రద్ధలతో వ్రతం చేద్దాం ''
ఆమాటవిని షావుకారు ''
బంధువులతో కలసి నదిఒడ్డున ''
వ్రతము చేసి సుఖముగా ఇంటికి చేరే ''
జన్మ అంతా షావుకారు ''
పౌర్ణమి దినమునవ్రతము చేసే ''
రవి సంక్రమణ దినమున కూడా చేసే ''
అట్లు నియమము తప్పక పూజ చేసి ''
సకల భోగాలు అనుభ వించి ''
అన్త్యమున సత్య పురికి పోయే ''
చతుర్ధ అధ్యాయము సమాప్తము

పంచమాధ్యాయము

సూత మహాముని మరల మునుల చూసి రమానాదా
ఇంకొక కథ చెప్పెద వినుడు ''
తుంగధ్వజుడనే రాజుకలడు ''
ప్రజలను కన్న తండ్రివలే చూచు ''
అరణ్యమునకు వేటకు బోయి ''
తిరిగీ వచ్చునపుడు ఒక చోట ''
గొల్లలందరూ సత్యనారాయణస్వామి ''
వ్రతము చేయు చేయు చుండి రచట ''
గర్వముచే రాజు ఆటకు పోలేదు ''
స్వామికి నమస్కారమైన చేయలేదు ''
ప్రసాదము తినని తప్పుకు ''
వారి నూర్గురు కొడుకులు చనిపోయిరి ''
ధన ,ధాన్యములు అంతరించే ''
లెక్కలేని కష్టములు వచ్చే ''
అపుడు రాజు కళ్లు తెరచి ''
"రాజుననే గర్వముతో నేను " ''
ప్రసాదమైనా భుజింపక వస్తి ''
నేను పొగరుగా ప్రవర్తించాను ''
ఆస్వామికి కోపము వచ్చే ''
నాఐశ్వర్య మంతా నశించిపోయే ''
అని రాజు మరల గొల్లల దగ్గిర కేగినాడు ''
యథా విధిగా సత్యమూర్తి వ్రతము చేసినాడు ''
స్వామి కృప వలన మరల పుత్రులు కలిగి నారు ''
ధనవంతుడాయి సుఖముగా బ్రతికినాడు ''
చివరికి స్వర్గ మునకు పోయినాడు ''
మహా ప్రభావ వంత మైన ఈవ్రతము ''
భక్తితో ఎవరాచరింతురో ''
కథ ఎవరు విన్దురో ''
వారికి సకల ఐశ్వర్యములు కలుగు ''
దరిద్రునకు ధనము వచ్చు ''
బద్ధుడు విముక్తు డగును ''
భయ భీతునకు ధైర్యము కలుగు ''
అపుత్రునకు పుత్రులు కలుగు ''
ఇహలోకమున సకల సౌఖ్యాలు ''
అన్త్యమున స్వర్గ లోకము ''
ఇట్టిఫలముల నిచ్చేటట్లు ''
సత్యనారాయణ వ్రతము తెలిపితి ''
కలియుగమున ఈవ్రతము ''
ప్రత్యక్షమైన ఫలము నొసగు ''
విశేష ఫల ప్రదమైనది ''
దీనినందరు ఆచరింప వలయు ''
కలియుగమున స్వామిని కొందరు ''
సత్యీశ్వరుడు , సత్యదేవుడని యందురు ''
సనాతనుడైన శ్రీహరి ''
కలియుగమున అనెకరూపముల ''
అవతరించి జనులందరికీ ''
కోరిన కోరిక లోసగు చుండును ''
ఇది సత్యము ,ముమ్మాటికీ సత్యము ''
ఈవ్రతము తామూ చేయ లేక పొతే ''
ఎవరైనా ఈవ్రతం చేస్తూంటే '
చూసిన ,కథను భక్తితో వినిన ''
సత్యనారాయణ స్వామి అనుగ్రహం ''
కలిగి ,కష్టములు తొలగు నయ్య ''
తటవర్తి భారతం జ్ఞాన ప్రసూనాంబ ''
వంశాన్ని కాచి రక్షించు సత్యనారాయణా ''
ఈపాటను పాడినా వారికి , వినిన వారికి ''
పలు శుభాములు మోక్ష ప్రాప్తి ప్రసాదించు ''
సత్యనారాయణ స్వామీ సంతసించి ''
ఆసీస్సులందించి మమ్ముల ధన్యం చేయి ''
సంపూర్ణం